News September 12, 2025
సికింద్రాబాద్: గాంధీలో సేవలు ఇకనైనా గాడిన పడేనా?

గాంధీ ఆస్పత్రి అంటేనే తెలుగు రాష్ట్రాల్లోని పేదలకు ఓ ధైర్యం.. అలాంటిది ఇటీవల ఇందులో సరైన సేవలందడం లేదని పలువురు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీనంతటికీ కారణం సూపరింటెండెంట్ డా.రాజకుమారి నిర్లక్ష్య వైఖరే కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పందించిన ప్రభుత్వం ఆమె స్థానంలో అడిషనల్ DME డా.వాణి నూతన సూపరింటెండెంట్‌ను నియమించింది. ఇప్పుడైనా సేవలు మెరుగుపడతాయేమోనని నగర వాసులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.
Similar News
News September 12, 2025
విశాఖ: మహిళా డాక్టర్‌ను వేధించిన వార్డ్‌బాయ్ సస్పెండ్

కేజీహెచ్‌లో వార్డ్ బాయ్ శంకర్రావు తనను వేధిస్తున్నాడంటూ ఓ మహిళా డాక్టర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో 10 రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. ఈ విషయం ఆస్పత్రిలోని పైఅధికారుల దృష్టికి వెళ్లడంతో వారు వార్డ్ బాయ్‌ను సస్పెండ్ చేస్తూ శుక్రవారం ప్రకటన జారీ చేశారు. ఈరోజు ఉదయం కూడా ఓ రోగి పట్ల వార్డ్ బాయ్స్ దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం.
News September 12, 2025
MNCL: ‘కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి’

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జేఏసి ఆధ్వర్యంలో శుక్రవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కకు వినతిపత్రం అందజేశారు. అనంతరం జేఏసి నాయకులు మాట్లాడారు. కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచాలని, లాభాల వాటా రూ.20 వేలు చెల్లించాలని, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఇందుకు డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.
News September 12, 2025
బెల్లంపల్లి: ‘పనులను త్వరగా పూర్తి చేయాలి’

బెల్లంపల్లిలోని కేజీబీవీ పాఠశాలలో అదనపు గదులు, మూత్రశాలల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం పరిశీలించారు. ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని సూచించారు.