News October 27, 2025
సికింద్రాబాద్: తుఫాన్.. ఆ రైళ్లు CANCEL

తుఫాన్ నేపథ్యంలో సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పలు రైళ్లను క్యాన్సల్ చేసింది. భువనేశ్వర్ నుంచి బెంగళూరు, భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్, భువనేశ్వర్ నుంచి పాండిచ్చేరి వెళ్లే రైళ్లను క్యాన్సల్ చేస్తున్నట్లు ప్రకటించింది. రేపు రైళ్ల రద్దు కొనసాగుతుందని CPRO శ్రీధర్ తెలిపారు.
Similar News
News October 27, 2025
మద్యం షాపుల కేటాయింపునకు డ్రా పూర్తి: HYD కలెక్టర్

హైదరాబాద్‌లో 82, సికింద్రాబాద్‌లో 97 మద్యం షాపుల కేటాయింపునకు డ్రా పూర్తయిందని జిల్లా కలెక్టర్ హరిచందన వెల్లడించారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లోని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ భవన్‌లో లాటరీ పద్ధతిలో మద్యం షాపుల కేటాయింపు జరిపారు. నూతన ఎక్సైజ్ పాలసీ నియమ, నిబంధనలను అనుసరిస్తూ ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పక్కాగా ఏర్పాట్లు చేశామన్నారు. రానున్న 2 సంవత్సరాలకు షాపులు కేటాయించినట్లు తెలిపారు.
News October 27, 2025
జూబ్లీహిల్స్‌లో ఎవరి పంతం నెగ్గుతుందో..?

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కేవలం BRS, కాంగ్రెస్ మధ్య రాజకీయమే కాదు PJR పిల్లల మధ్య కూడా నువ్వానేనా అన్నట్లుగా మారింది. స్థానిక ప్రజలకు PJR అంటే ఎనలేని అభిమానం. కాగా ఆయన కుమారుడు, మాజీ MLA విష్ణువర్ధన్ రెడ్డి BRSలో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ జెండా ఎగరనీయనని అంటున్నారు. PJR కుమార్తె, కార్పొరేటర్ విజయారెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నారు. BRSను ఓడగొడతామంటున్నారు. మరి ఎవరి పంతం నెగ్గుతుందో చూడాలి.
News October 27, 2025
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం.. ఎంపీ గోపూజ

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అన్ని పార్టీల అభ్యర్థులు, ముఖ్య నేతలు గల్లీ గల్లీ తిరుగుతున్నారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా రాజ్యసభ సభ్యుడు, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ సోమవారం యూసుఫ్‌గూడలో ప్రచారం చేశారు. ఇందులో భాగంగా ఓ నివాసంలో దూడ కనపడే సరికి వారు దానికి పూజ చేసి అక్కడి నుంచి బయలుదేరారు. ప్రజలు తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.


