News August 19, 2025

సికింద్రాబాద్: దక్షిణ మధ్య రైల్వే చరిత్రలోనే రికార్డు

image

సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే చరిత్రలో మహిళలు రికార్డ్ సాధించారు. జోన్‌లోని 5 కీలకమైన వాణిజ్య, ఆపరేటింగ్, ఫైనాన్స్, సెక్యూరిటీ, వైద్య విభాగాలను మహిళా అధికారులు నిర్వహిస్తున్నారు. ఆపరేషన్స్ మేనేజర్‌గా కె.పద్మజ, భద్రత విభాగానికి అరోమాసింగ్ ఠాకూర్, ప్రధాన ఆర్థిక సలహాదారుగా హేమ సునీత, వాణిజ్యానికి కమర్షియల్ మేనేజర్‌గా ఇతి పాండే, ప్రిన్సిపల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్‌గా నిర్మల నరసింహన్ ఉన్నారు.

Similar News

News August 19, 2025

HYD: వరుసగా వర్షాలు.. నగరంలో మురుగు పరుగులు

image

వరుసగా వర్షాలు కురుస్తుండడంతో గ్రేటర్ HYDలో మురుగు పరుగులు పెడుతోంది. దీంతో పాదచారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుత్బుల్లాపూర్‌లోని పద్మానగర్, మాదన్నపేట, బాలానగర్‌లోని రాజీవ్ గాంధీనగర్, గచ్చిబౌలిలోని ఓఆర్ఆర్ ఎక్స్ రోడ్, కొండాపూర్‌లోని కేఎంఆర్ ఎస్టేట్ వద్ద, బేగంపేటలోని వసంతనగర్, పాటిగడ్డ తదితర ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్యలతో స్థానికులు సతమతమవుతున్నారు.

News August 19, 2025

HYD: మార్వాడీలను గో బ్యాక్ అనడం ఎందుకు..?: VH

image

రిలయన్స్, డీ మార్ట్ లాంటి బడా కంపెనీల్లో అన్ని వస్తువులు దొరుకుతున్నప్పుడు.. మార్వాడీలను గో బ్యాక్ అనడం ఎందుకని మాజీ ఎంపీ హనుమంత్‌రావు అన్నారు. మంగళవారం HYD గాంధీ భవన్‌లో ఆయన మాట్లాడారు. ‘తెలంగాణకు ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది వస్తున్నారు.. ఈ విధమైన నినాదాలతో అభివృద్ధి కుంటు పడుతుంది.. రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.. ఇది సరైన పద్ధతి కాదు’ అని అన్నారు.

News August 19, 2025

HYD: ‘హజ్ యాత్రికులకు గమనిక.. రేపటిలోపు డబ్బు చెల్లించాలి’

image

హజ్-2026 యాత్రికులకు HYDలో హజ్ కమిటీ కీలక సూచనలు చేసింది. హజ్ యాత్రకు ఎంపికైన వారు ఈనెల 20లోపు మొదటి ఇన్‌స్టాల్‌మెంట్ మొత్తం చెల్లించాలని సూచించింది. అలాగే డబ్బు చెల్లించిన రసీదు, మెడికల్ రిపోర్టులు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ను ఈనెల 25లోపు ఇవ్వాలని హజ్ కమిటీ ఛైర్మన్ సయ్యద్ గులామ్ అఫ్జల్ బియాబని తెలిపారు. హజ్ యాత్రికులు సాధ్యమైనంత త్వరగా ఫీజు చెల్లించాలని కోరారు.