News October 23, 2025

సికింద్రాబాద్: ప్రయాణికులతో ‘పరిచయ కార్యక్రమం’

image

తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి ఆదేశాల మేరకు ఆర్టీసీలో పని చేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులతో పరిచయ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. డీఎం సరితా దేవి ఆదేశంతో ఈరోజు కండక్టర్, వీబీఓ గోపు శ్రీనివాస్ సికింద్రాబాద్ టు వర్గల్ బస్ ప్రయాణికులతో పరిచయం చేసుకున్నారు. రూట్ వివరాలు, సమయ పట్టిక, ఆర్టీసీ ఆఫర్స్, సేవలు, సోషల్ మీడియా, సైట్లపై వివరించారు.

Similar News

News October 23, 2025

BREAKING: HYD: విషాదం.. ఇంటర్ విద్యార్థి మృతి

image

ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఘట్‌కేసర్ పరిధి యమ్నంపేట్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీ బిల్డింగ్ నాలుగో అంతస్తు నుంచి ఇంటర్ విద్యార్థి అభిచేతన్ రెడ్డి(17) పడ్డాడు. అతడిని మేడిపల్లిలోని శ్రీకర హాస్పిటల్‌కి తరలించగా అప్పటికే మృతిచెందాడని వైద్యులు తెలిపారు. డెడ్‌బాడీని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా అతడు దూకాడా?, ఎవరైనా తోశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

News October 23, 2025

జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెసోళ్లను నిలదీయండి: KCR

image

పేద గర్భిణులకు మానవీయ కోణంలో అందిస్తోన్న KCR కిట్ పథకాన్ని ఎందుకు ఆపేశారో కాంగ్రెసోళ్లను జూబ్లీహిల్స్ ప్రజలు నిలదీయాలని మాజీ CM KCR పిలుపునిచ్చారు. యాదవులకు అందిస్తోన్న గొర్రెల పంపిణీ పథకాన్ని ఎందుకు రద్దు చేశారో, చేపల పంపిణీ ఎందుకు దిగమింగారో ఓటు అడిగేందుకు ఇంటి ముందుకు వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థిని అడగాలని KCR కోరారు. పథకాలపై ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.

News October 23, 2025

జూబ్లీహిల్స్‌ బైపోల్.. KCR పిలుపు

image

జూబ్లీహిల్స్ బైపోల్‌పై మాజీ CM KCR మొదటి సారి మాట్లాడారు. కాంగ్రెస్ దుష్ట పాలనపై ప్రజలకు BRS నేతలు, కార్యకర్తలు వివరించి, అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ రౌడీ షీటర్‌ను నిలబెట్టి HYD ప్రజల విజ్ఞతకు కఠిన పరీక్ష పెట్టిందన్నారు. రౌడీషీటర్‌ను ఓడించి, HYDలో శాంతిభద్రతలను కాపాడాలని కోరారు. నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ దోపిడీ పాలనతో తెలంగాణను గుల్లా చేసిందన్నారు.