News August 24, 2024
సికింద్రాబాద్: ‘మంకీ ఫాక్స్ గాలిలో వ్యాప్తి చెందదు’

మంకీ ఫాక్స్ వ్యాప్తిపై గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి కీలక వ్యాఖ్యలు చేశారు. మంకీ ఫాక్స్ కేవలం ఆ రుగ్మత కలిగిన వారిని తాకినవారికి మాత్రమే సోకే అవకాశం ఉంటుందని, గాలిలో వ్యాప్తి చెందదని ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాల మేరకు మంకీ ఫాక్స్ బాధితులకు వైద్యం అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
Similar News
News February 28, 2026
HYD: ఇలా అడ్డంగా దొరికిపోయారు!

చెరువు ప్రక్షాళన పనులకు సంబంధించిన ₹1.40 కోట్ల బిల్లు పాస్ చేయాలంటే కూకట్‌పల్లి SE చల్లా చిన్నారెడ్డి ఏకంగా ₹15 లక్షలు డిమాండ్ చేసి దొరికిపోయాడు. దుండిగల్‌లో బిల్డింగ్ పర్మిషన్ కోసం లక్షల్లో లంచం ఆశించిన అధికారి బుక్కయ్యాడు. ఎవరినైనా వదిలే ప్రసక్తే లేదని బండ్లగూడ ఘటన నిరూపించింది. ప్రైవేట్ స్కూల్ ఎగ్జామ్ సెంటర్ పర్మిషన్ ఫైల్‌ను ముందుకు కదపాలంటే <<19262574>>₹10K<<>> అడిగిన జూ.అసిస్టెంట్ శివప్రసాద్‌ను వదలలేదు.
News February 28, 2026
అవినీతి అనకొండల గుండెల్లో ACB ‘దడ’

సిటీలో లంచగొండి బాబుల ఆటలు ఇక సాగవు. 2025లో తెలంగాణ ACB ఏకంగా 199 కేసులు నమోదు చేసి రికార్డు సృష్టించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 29.2% పెరుగుదల. ముఖ్యంగా GHMC పరిధిలో 2025 చివరి మూడు నెలల్లోనే గత 14 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 78 కేసులు నమోదయ్యాయి. మొత్తం 273 మందిని అరెస్ట్ చేయగా, అందులో 176 మంది ప్రభుత్వ ఉద్యోగులే. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ₹96.13 కోట్ల అక్రమ సంపాదనను ఏసీబీ బయటపెట్టింది.
News February 28, 2026
తొమ్మిదే నెలల్లో ‘ఫ్యూచర్ సిటీ’ నైటౌట్

హైదరాబాద్ రేంజ్ మారిపోతోంది బాబోయ్! 765 చదరపు కిలోమీటర్ల భారీ విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న ‘ఫ్యూచర్ సిటీ’కి సర్కార్ డెడ్ లైన్ ఫిక్స్ చేసింది. కేవలం 9 నెలల్లోనే పూర్తిస్థాయి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని టెండర్లో స్పష్టం చేసింది. 56 గ్రామాలను కలుపుతూ గ్లోబల్ కంపెనీలు, యూనివర్సిటీలే లక్ష్యంగా ఈ నగరం నిర్మిస్తున్నారు. కాలుష్యం లేని నెట్-జీరో పద్ధతిలో అద్భుత నగరం మన కళ్లముందే సాక్షాత్కరించబోతోంది.


