News September 2, 2025
సికింద్రాబాద్: రెండు నెలల్లో 33 మంది అరెస్ట్

సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తున్న రైళ్లను టార్గెట్ చేస్తూ రాళ్లు విసురుతున్న 33 మందిని రైల్వే ప్రొటెక్షన్ పోలీసులు అరెస్ట్ చేశారు. జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు 54 రైళ్లపై రాళ్లు రువ్వినట్లు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఇంకా 30 మంది పరారీలో ఉన్నారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు ఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. రైళ్లపై రాళ్లు రువ్వితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News September 3, 2025
శ్రీశైలంలో శివపార్వతుల కళ్యాణంపై హరికథ

శ్రీశైలం దేవస్థానంలో నిత్యం నిర్వహిస్తున్న నిత్య కళారాధన, ధర్మపథం కార్యక్రమంలో భాగంగా కర్నూలుకు చెందిన భాగవతారిణి లక్ష్మీ మహేశ్ బృందం ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం మీద నిర్వహించిన హరికథ గానం భక్తులను అలరించింది. మంగళవారం రాత్రి కళారాధన మండపంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రదర్శన అనంతరం కళాకారులకు స్వామి, అమ్మవారి ప్రసాదాలు అందించి అభినందించారు.
News September 3, 2025
ఈ నెల 6న కర్నూలులో జిల్లాస్థాయి మారథాన్ పోటీలు

ఈనెల 6న ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు కర్నూలులో జిల్లాస్థాయి మారథాన్ 5 కిలోమీటర్ల పరుగు పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ భాస్కర్ వెల్లడించారు. కర్నూలులోని స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో క్రీడా అధికారులతో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు. 17 నుంచి 25 ఏళ్లు కలిగిన విద్యార్థులు, యువకులు, మహిళలు పాల్గొనవచ్చన్నారు. కార్యక్రమంలో డీఎస్డీఓ భూపతి పాల్గొన్నారు.
News September 3, 2025
‘సహజ వనరులైన అడవులను కాల్చితే ఊరుకోం’

హిందూపురంలోని కొడిగేహళ్లి డిగ్రీ కళాశాలలో పర్యావరణంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ పర్యావరణవేత్త భాస్కర్ హాజరై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సహజ సిద్దమైన అడవులకు హాని కలిగించడం, చెట్లు నరకడం, కూల్చివేయడం లాంటి చర్యలకు పాల్పడితే ఊరుకోబోమన్నారు. చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.