News April 4, 2025

సికింద్రాబాద్: రైలులో బాలికకు లైంగిక వేధింపులు

image

సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగుచూసింది. రక్సెల్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ బాలిక అర్ధరాత్రి 2 గంటలకు వాష్ రూమ్‌కు వెళ్లింది. ఇది గమనించిన ఓ యువకుడు ఆమెను అనుసరించాడు. బాత్రూం వద్ద అరగంట సేపు ఆపి వీడియోలు తీసి, లైంగికంగా వేధించాడు. బాధితురాలు ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు రైల్వే టోల్‌ఫ్రీ నంబరు 139కి ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Similar News

News July 10, 2025

హైదరాబాద్‌లో కల్తీ కల్లు కలకలం

image

హైదరాబాద్ నగరంలో కల్తీ కల్లు ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో నిన్నటి వరకు ఐదుగురు మృతిచెందగా.. 31 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కూకట్‌పల్లి PS పరిధిలోని కల్లు కాంపౌండ్లలో మోతాదుకు మించిన కెమికల్స్ కలిపిన కల్లు తాగడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఎక్సైజ్ అధికారులు 5 కేసులు నమోదు చేశారు. కాగా కల్లు దుకాణాలపై నిఘా ఉంచాల్సిన అధికారులు చూసిచూడనట్లు వ్యవహరించడంతో విమర్శలు వస్తున్నాయి.

News July 10, 2025

వైభవంగా చాదర్‌ఘాట్ రేణుకా ఎల్లమ్మ కళ్యాణం

image

పసుపు కుంకుమల సంగమాన్ని తలపించిన వీధులు.. వేద పండితుల మంత్రోచ్చరణలు, భాజా భజంత్రీలు.. శివసత్తుల నృత్యాలు వెరసి భక్త జన సందోహం నడుమ చాదర్‌ఘాట్ రేణుకా ఎల్లమ్మ కళ్యాణం అంగరంగవైభవంగా జరిగింది. ఆలయ కమిటీ ఛైర్మన్ ఆరెల్లి అంజయ్య దంపతులు, కుటుంబ సభ్యులు అమ్మవారి కళ్యాణాన్ని అంగరంగ వైభంగా నిర్వహించారు. దాతలను ఆలయ కమిటీ ఛైర్మన్ అమ్మవారి శేష వస్త్రాలతో సత్కరించారు.

News July 9, 2025

బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ మేకప్ పరీక్ష ఫీజు స్వీకరణ

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఈ కోర్సు ఆరో సెమిస్టర్ మేకప్ పరీక్షా ఫీజును ఈనెల 14వ తేదీలోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని చెప్పారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.