News March 18, 2024

సికింద్రాబాద్: రైలు ఢీకొని వ్యక్తి మృతి

image

రైలు పట్టాలు దాటుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ జీఆర్పీ పరిధిలోని అల్వాల్, బొల్లారం బజార్ రైల్వే స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం జరిగింది. కాగా, పోలీసులు మృత దేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వయసు 35ఏళ్ల లోపు ఉంటుందన్నారు. 5.5 అడుగుల ఎత్తు, కోల ముఖం, లైట్ క్రీమ్ కలర్ షర్ట్, బూడిద రంగు జీన్స్ ప్యాంట్ ధరించాడు.

Similar News

News January 7, 2025

HYDలో భారీగా పెరిగిన ఓటర్లు

image

రాష్ట్రవ్యాప్తంగా తుది ఓటరు జాబితా విడుదలైంది. రంగారెడ్డి, HYD, మేడ్చల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కలిపి 1.12 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి నియోజకవర్గం అత్యధికంగా 7.65 లక్షల మంది ఓటర్లతో మొదటి స్థానంలో ఉండగా.. 2.32 లక్షలమంది ఓటర్లతో చివరి స్థానంలో చార్మినార్ ఉంది. కేవలం ఒక్క ఏడాదిలోనే 2 లక్షల మంది ఓటర్లు పెరిగినట్లు అధికారులు తెలిపారు.

News January 7, 2025

HYD: బాలికపై అత్యాచారం.. నిందితుడికి 20ఏళ్ల జైలు

image

మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్ష, రూ.15వేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి కోర్టు తీర్పు ఇచ్చింది. 2018లో వనస్థలిపురం PS పరిధిలో తాపీ మేస్త్రిగా పనిచేసే కార్తిక్(22) ఓ బాలికను ప్రేమ పేరుతో మభ్యపెట్టి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో నిందితుడిపై పోక్సో కేసు నమోదైంది. ఈ కేసుపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి ఈ మేరకు తీర్పు వెల్లడించారు.

News January 7, 2025

సంక్రాంతి తర్వాత రైతు భరోసా డబ్బులు: మంత్రి తుమ్మల

image

రైతు భరోసా డబ్బులను సంక్రాంతి పండగ తర్వాత రైతుల ఖాతాల్లో జమచేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం చేవెళ్ల మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ దుకాణాల సముదాయం గోదాములను స్పీకర్ ప్రసాద్ కుమార్, ఎమ్మెల్యే యాదయ్యతో కలిసి మంత్రి ప్రారంభించారు. రైతుల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని చెప్పారు.