News January 1, 2025

సికింద్రాబాద్‌ రైల్వేలో ఉద్యోగాలు

image

రైల్వే శాఖలో ఉద్యోగం చేయాలనుకునేవారికి శుభవార్త. తాజాగా RRB గ్రూప్‌ D నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తంగా 32000 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఇందులో మన సికింద్రాబాద్ రీజియన్‌లోనూ ఖాళీలు ఉన్నాయని నోటిఫికేషన్‌‌లో రైల్వే శాఖ పేర్కొంది. స్టార్టింగ్ శాలరీ రూ. 18000 ఉంటుంది. 18-36 ఏళ్లు గలవారు అర్హులు. జనవరి 23 నుంచి ఫిబ్రవరి 22 వరకు అప్లై చేసుకోవచ్చు. అర్హత: 10th, ITI ఉత్తీర్ణత.
SHARE IT

Similar News

News January 4, 2025

హైదరాబాద్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు

image

హైదరాబాద్ జిల్లాలో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.. వెస్ట్ మారేడ్‌పల్లిలో 11.8℃, గోల్కొండ, సులేమాన్ నగర్ 12.4, లంగర్‌హౌస్ 13.7, చాంద్రాయణగుట్ట 14.1, రియాసత్‌నగర్ 14.5, అంబర్‌పేట్ 14.7, బహదూర్‌పుర, మోండామార్కెట్ 14.9, కంటోన్మెంట్ ఏరియా 15.2, బండ్లగూడ 15.2, గౌలివాడ 15.3, ఆసిఫ్‌నగర్ 15.4, ముషీరాబాద్ 15.4, యూసుఫ్‌గూడ 16, వెంగళ్‌రావునగర్ 16, అజంపురా 16.1, ఓయూ 16.2, ఖైరతాబాద్‌లో 16.3గా నమోదైంది.

News January 4, 2025

గ్రేటర్‌లో గజగజ వణుకుతున్న పట్టణప్రజాలు

image

శివారు ప్రాంతాల్లో చలితీవ్రత పెరిగింది. పటాన్‌చెరులో అత్యల్పంగా 8.4 సెం.మీ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవ్వగా రాజేంద్రనగర్‌ ప్రాంతంలో 10 సెం.మీ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గ్రేటర్‌లోని సాధారణంగా 5 డిగ్రీల వరకు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చలిగాలులతో రాత్రుళ్లు బయట అడుగుపెట్టేందుకు ప్రజలు వణికిపోతున్నారు. బేగంపేటలో 13.6, దుండిగల్‌లో 13.8, హయత్‌నగర్‌లో 14, హకీంపేటలో 14.3 నమోదయ్యాయి.

News January 4, 2025

వట్టినాగులపల్లిలో నేడు ఫైర్ డిపార్ట్‌మెంట్ పరేడ్

image

వట్టినాగులపల్లి ఫైర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఫైర్ డిపార్ట్మెంట్‌లో 196 డ్రైవర్, ఆపరేటర్ల శిక్షణ పూర్తైంది. టెక్నికల్, నాన్‌టెక్నికల్‌గా 4 నెలల పాటు శిక్షణ పూర్తి చేసుకున్న వీరికి డ్రైవర్, ఆపరేటర్స్ పరేడ్ ఉండనుంది. పరేడ్‌కి ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధర్ బాబు హాజరుకానున్నారు.