News January 17, 2026
సికింద్రాబాద్: ‘ర్యాలీకి పోలీసుల అనుమతి లేదు’

సికింద్రాబాద్ సాధన సమితి నిర్వహించ తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతిని నిరాకరించారు. హైదరాబాద్ నార్త్ జోన్ జాయింట్ సీపీ ఈ మేరకు స్పష్టం చేశారు. భద్రతా కారణాలు, ట్రాఫిక్ ఇబ్బందుల నేపథ్యంలో ర్యాలీకి అనుమతి ఇవ్వలేదని అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం రాజకీయ, ప్రజావర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.
Similar News
News February 13, 2026
HYD: BEWARE OF రొమాన్స్ స్కామ్స్.. జాగ్రత్త బ్రో!

వాలంటైన్స్ డే ఆఫర్లంటూ వచ్చే లింకులు నొక్కారో మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అవ్వడం ఖాయం. గతేడాది మన రాష్ట్రంలో రొమాన్స్, మ్యాట్రిమోనీ ఫ్రాడ్స్ ద్వారా ఏకంగా ₹12.65 కోట్లు కొల్లగొట్టారు. గిఫ్టులు, ఫ్లవర్ డెలివరీల పేరుతో వచ్చే ఫేక్ మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండండి. గుర్తుతెలియని వ్యక్తులకు ఫొటోలు, ఓటీపీలు షేర్ చేయొద్దు. మోసపోతే వెంటనే 1930కి కాల్ చేయండని హైదరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు. బీ అలర్ట్ బాసూ!
News February 13, 2026
మూడు కార్పొరేషన్లు.. కో-ఆప్షన్ కొలువులో కొత్త లెక్క!

జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లలో కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక ఇప్పుడు హాట్ టాపిక్. గతంలో ఐదుగురు సభ్యులకే పరిమితమైన ఈ కోటా ఇప్పుడు ఆరుగురికి పెరగడంతో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. తమకు అవకాశం దక్కుతుందా అని ఆశావాహులు ఆరా తీస్తుండగా, పాత లెక్కలు మారి కొత్త వారి ఎంట్రీకి మార్గం సుగమమైంది. పెరిగిన సభ్యుల బలంతో పాలనలో వేగం పెంచాలని అధికారులు భావిస్తున్నారు.
News February 13, 2026
HYD: రేపే TG EAPCET నోటిఫికేషన్..!

JNTU, తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో నిర్వహించనున్న TG EAPCET 2026 ప్రవేశ పరీక్షకు సంబంధించి శనివారం ఉదయం నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు పరీక్షల కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. 19వ తేదీ ఉదయం 11:30 గంటల నుంచి ఆన్‌లైన్‌లో విద్యార్థులు దరఖాస్తులు సమర్పించవచ్చని సూచించారు. ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. SHARE IT.


