News September 20, 2024

సికింద్రాబాద్: వారం రోజుల్లో 443 ఫీవర్ కేసులు నమోదు

image

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి వైరల్ జ్వరాల బాధితులు క్యూ కడుతున్నారు. వారం రోజుల్లో 443 ఫీవర్ కేసులు నమోదయ్యాయని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 25 డెంగీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరందరికీ వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ తెలిపారు. వీరి కోసం ప్రత్యేక విభాగం కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Similar News

News September 20, 2024

HYD: దానం వ్యాఖ్యలపై మీ కామెంట్?

image

బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్‌పై ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించిన విషయం విదితమే. గతంలో సోనియా గాంధీ పట్ల అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై కేసీఆర్ ఖండించారని గుర్తు చేశారు. స్త్రీలను గౌరవించడం మర్యాదకు సంబంధించిన అంశం అన్నారు. మహిళల పట్ల దిగజారుడు వ్యాఖ్యలు సరికాదన్నారు. దానం వ్యాఖ్యలపై మీ కామెంట్?

News September 20, 2024

HYD: నేటి నుంచి గచ్చిబౌలి ఫ్లైఓవర్ మూసివేత

image

గచ్చిబౌలి ఫ్లైఓవర్ పరిసర ప్రాంతాల్లో నేటి నుంచి ఈనెల 26 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. గచ్చిబౌలి జంక్షన్‌లో SRDP శిల్పా లేఅవుట్ ఫేజ్-2 ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కారణంగా ఫ్లైఓవర్ మూసివేస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికులు, వాహనదారులు గమనించి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

News September 20, 2024

HYD: ఆన్‌లైన్‌లో అమ్మాయి కాదు అబ్బాయి!

image

న్యూడ్ కాల్స్ పేరిట యువకులను మోసం చేస్తున్న వ్యక్తిని HYD సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. డేటింగ్ వెబ్‌సైట్స్ ద్వారా వల వేసి బ్లాక్ మెయిల్ చేస్తున్న బెంగుళూరు వాసి రిషద్ బేడీని అదుపులోకి తీసుకున్నారు. అమ్మాయి లాగా ఫేక్ ప్రొఫైల్స్ సృష్టించి, పలువురు యువకులను ఆకట్టుకున్నాడు. బాధితుల న్యూడ్ ఫొటోలు సేకరించి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశాడు. ఈ ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేశారు.