News February 1, 2025

సికింద్రాబాద్ వారసిగూడ మహిళ మృతి కేసులో ట్విస్ట్

image

సికింద్రాబాద్ వారసిగూడ <<15327304>>మహిళ మృతి<<>> కేసులో ట్విస్ట్ నెలకొంది. ఈనెల 22న తల్లి లలిత చనిపోగా డిప్రెషన్‌కు గురైన ఇద్దరు కూతుళ్లు చనిపోదామనుకుని సూసైడ్ లెటర్ రాశారు. కాగా నిన్న విషయం బయటకు రావడంతో పోలీసులు ఘటనా స్థలంలో ఆ సూసైడ్ లెటర్ స్వాధీనం చేసుకున్నారు. అయితే తండ్రి రాజుతో ఇద్దరు కూతుళ్లకు గొడవ జరగగా ఐదేళ్లుగా ఆయన దూరం వెళ్లిపోయాడు. నాలుగేళ్లుగా మేనమామతోనూ వారికి గొడవ ఉందని స్థానికులు తెలిపారు.

Similar News

News February 1, 2025

BUDGET: వీటి ధరలు తగ్గుతాయ్

image

ధరలు తగ్గేవి: మొబైల్ ఫోన్స్, ఈవీ బ్యాటరీస్, మెరైన్ ప్రొడక్ట్స్, LED, వెట్ బ్లూ లెదర్, ఓపెన్ సెల్, 36 లైఫ్ సేవింగ్ డ్రగ్స్&మెడిసిన్స్, ఫ్రోజెన్ ఫిష్ పేస్ట్ (సురిమి), కారియర్ గ్రేడ్ ఈథర్నెట్ స్విచ్‌లు, 25 రకాల క్రిటికల్ మినరల్స్, జింక్, లిథియం-అయాన్ బ్యాటరీ స్క్రాప్.

ధరలు పెరిగేవి: ఫ్లాట్ ప్యానెల్ డిస్‌ప్లే, నిటెడ్ ఫ్యాబ్రిక్స్ (అల్లిన దుస్తులు)

News February 1, 2025

‘కాంగ్రెస్ డిఫీట్.. కేసీఆర్ రిపీట్’: జీవన్ రెడ్డి

image

ఈ క్షణంలో ఎన్నికలు జరిగినా ‘కాంగ్రెస్ డిఫీట్.. కేసీఆర్ రిపీట్’ అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. ఈ విషయం కాంగ్రెస్ పార్టీ స్వయంగా నిర్వహించుకున్న పోల్ సర్వేలోనే తేటతెల్లమైందని ఆయన శనివారం పేర్కొన్నారు. కేసీఆర్ స్వర్ణ యుగం మళ్లీ రావాలన్నది తెలంగాణ ప్రజల హార్ట్ బీట్ అని ఆయన అభిప్రాయపడ్డారు.

News February 1, 2025

గద్వాల: 43 మంది బాలకార్మికులకు విముక్తి

image

జనవరిలో ఆపరేషన్ స్మైల్-XI బృందం దాడులు నిర్వహించి జిల్లా వ్యాప్తంగా 43 మంది బాలకార్మికులను గుర్తించి వారిని పని నుంచి విముక్తి కల్గించి, అందుకు సంబంధించి 2 కేసులు నమోదు చేశామని ఎస్పీ శ్రీనివాస రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా జనవరి 1 నుంచి 31 వరకు జిల్లాలోని బైక్ షాపులు, కిరాణా షాపులు, పొలాల్లో తదితర ప్రాంతాల్లో తనిఖీ చేశారన్నారు.