News March 23, 2024

సికింద్రాబాద్- సంత్రాగచ్చి మధ్య ప్రత్యేక రైలు

image

హోలీ పండగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్- సంత్రాగచ్చి- సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె. త్రిపాఠి తెలిపారు. సికింద్రాబాద్- సంత్రాగచ్చి (07645) ప్రత్యేక రైలు ఈ నెల 23వ తేదీ రాత్రి 9.05 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మర్నాడు ఉదయం 9.35కు దువ్వాడ చేరుకొని ఇక్కడి నుంచి 9.40కు బయలుదేరి వెళుతుందన్నారు.

Similar News

News April 24, 2025

సీఎం చంద్రబాబు తిరుగు ప్రయాణం

image

కశ్మీర్ ఘటనలో మృతి చెందిన చంద్రమౌళికి ఘన నివాళి అర్పించిన అనంతరం సీఎం చంద్రబాబు తిరుగు ప్రయాణమయ్యారు. బుధవారం సాయంత్రం విశాఖ చేరుకున్న ఆయన చంద్రమౌళికి నివాళులు అర్పించడంతో పాటు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం అమరావతికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడితో పాటు కలెక్టర్ హరేంధిర ప్రసాద్, తదితరులు వీడ్కోలు పలికారు.

News April 23, 2025

చంద్రమౌళి మృతదేహానికి సీఎం నివాళి

image

ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జేఎస్ చంద్రమౌళి మృతదేహానికి సీఎం చంద్రబాబు శ్రద్ధాంజలి ఘటించారు. ముందుగా పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యలను ఓదార్చి ధైర్యం చెప్పారు. సీఎంతో పాటు ఎమ్మెల్యే గణబాబు, విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ చిరంజీవి, పలువురు కూటమి నాయకులు ఉన్నారు.

News April 23, 2025

విశాఖలో వైశ్యరాజు జువెలర్స్‌ షోరూం ప్రారంభం

image

విశాఖలోని ఆశీల్‌మెట్ట, సంపత్ వినాయక దరిలో వైశ్యరాజు జువెలర్స్‌ 18KT గోల్డ్ షోరూంను ప్రారంభించినట్లు MD వైశ్యరాజు తెలిపారు. వినయగర్ ప్యారడైజ్, భూస్వాములు లగడపాటి కిరణ్ కుమార్, మంత్రి శేషగిరిలు, నగేశ్‌లతో కలిసి షోరూంను ప్రారంభించారు. ఇండియాలో మొట్టమొదటి 18KT గోల్డ్ షోరూం ఇదేనని MD వైశ్యరాజు పేర్కొన్నారు. 18KT జువెలరీపై తరుగు(VA) 6% నుంచి ఉంటుందన్నారు. ఛైర్మన్ ఫల్గుణరాజు, డైరెక్టర్లు పాల్గొన్నారు.

error: Content is protected !!