News March 6, 2025
సికింద్రాబాద్: స్నేహితుడి దారుణ హత్య

HYDలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. స్థానికుల వివరాలు.. సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని తరుణి సూపర్ మార్కెట్ వెనకాల రాత్రి ఘర్షణ జరిగింది. మద్యం మత్తులో స్నేహితుడు నగేశ్‌ను నర్సింగ్ అనే వ్యక్తి కర్రతో కొట్టి చంపేశాడు. ఈ సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని గాంధీకి తరలించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 6, 2025
మన హైదరాబాద్ కల్చర్ వేరు!

తెలుగు రాష్ట్రాల్లో మన హైదరాబాద్ కల్చర్ వేరు. ఊర్లో 10 ఎకరాలు ఉంటే గొప్ప. ఇక్కడ 100 గజాల్లో సొంతిళ్లు ఉన్నా గొప్పే. ఉన్నదాంట్లో సంతోషంగా ఉండేది హైదరాబాదీలే అనిపిస్తది. పండుగలు, పబ్బాలకు బలగం ఏకమవుతుంది. కుల, మత భేదం లేకుండా దోస్తానా కోసం జాన్ ఇస్తరు. మాస్‌కు కేరాఫ్ ధూల్‌పేట గల్లీలైతే, క్లాస్‌కు కేరాఫ్‌గా IT కారిడార్. ఏకంగా లక్షల మందికి మన HYD ఉపాధినివ్వడం విశేషం.
We Proud to Be A Hyderabadi
News March 6, 2025
HYD: మార్చి 8న వాటర్ బంద్

BHEL జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మిస్తున్న కారణంగా ఈనెల 8న నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని HMWSSB అధికారులు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎర్రగడ్డ, SRనగర్, HBకాలనీ, మూసాపేట, జగద్గిరిగుట్ట, కూకట్‌పల్లి, అశోక్‌నగర్, RCపురం, లింగంపల్లి, చందానగ, మదీనాగూడ, మియాపూర్, గంగారం, జ్యోతినగర్, బీరంగూడ, శ్రీనగర్, అమీన్‌పూర్, నిజాంపేట్‌లో అంతరాయం ఉంటుందన్నారు.
News March 5, 2025
రంగారెడ్డి జిల్లాలో పరీక్ష రాసింది ఎందరంటే?

రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మొదటి రోజు ఇంటర్మీడియట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 185 పరీక్ష కేంద్రాలలో జనరల్‌తో పాటు ఒకేషనల్ విద్యార్థులతో కలిపి 83,829 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని అధికారులు తెలిపారు. 1,863 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారన్నారు. పరీక్షలు పూర్తైన అనంతరం ఆన్సర్ పేపర్లను స్ట్రాంగ్ రూమ్స్‌కు తరలించినట్లు తెలిపారు.