News September 15, 2024

సికింద్రాబాద్: 15,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు

image

గ్రేటర్ పరిధిలో గణేశ్ నిమజ్జనం కోసం 15,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్ సీపీ సీవీఆనంద్ తెలిపారు. ట్యాంక్ బండ్ సహా ఇతర అన్ని చెరువుల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. నిమజ్జనం రోజున ఉండే వేరే కార్యక్రమాలకు ప్రత్యేకంగా బందోబస్తు ఇస్తున్నామన్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులతో పాటు ఇతర జిల్లాల నుంచి ప్రత్యేక సిబ్బందిని తెస్తున్నామన్నారు.

Similar News

News February 23, 2026

బంజారాహిల్స్‌‌లో ర్యాపిడో బైక్‌ను ఢీ కొట్టిన ట్యాంకర్.. ఇద్దరి మృతి

image

బంజారాహిల్స్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న వాటర్ ట్యాంకర్ ర్యాపిడో బైక్‌ను వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌ నడుపుతున్న రైడర్ (హోంగార్డ్), అతని వెనక కూర్చున్న యువతి అక్కడికక్కడే మృతి చెందారు. యువతిని పిక్ చేసుకున్న కొన్ని నిమిషాలకే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకొన్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

News February 23, 2026

HYD: పేదల ఇళ్ల కూల్చివేతలపై UDF ధ్వజం..!

image

మూసీ ప్రక్షాళన ముసుగులో పేదల ఇళ్లను కూల్చడం అన్యాయమని అర్బన్ డెవలప్‌మెంట్ ఫోరం మండిపడింది. దశాబ్దాలుగా ఉంటోన్న వారిని బఫర్ జోన్ పేరుతో రోడ్డున పడేయడం ఏంటని ప్రశ్నించింది. DPR సిద్ధం కాకుండానే తొలగింపులు చేపట్టడం బాధ్యతారాహిత్యమని కన్వీనర్ శ్రీనివాస్ ధ్వజమెత్తారు. రియల్ ఎస్టేట్, టూరిజం బిజినెస్ కోసం సామాన్యుల గూళ్లు కూల్చొద్దని, నదిని మాత్రమే శుద్ధి చేయాలని కోరారు. తక్షణమే కూల్చివేతలను ఆపాలన్నారు.

News February 23, 2026

HYD: ఇకపై అలాంటివారిని పట్టిస్తే రూ.200/-

image

మీ వీధిలో ఎవరైనా మోటారు పెట్టి సంపులు పొంగిస్తున్నారా? పైపు లీకేజీని పట్టించుకోకుండా వదిలేస్తున్నారా? అయితే వెంటనే అలర్ట్ అవ్వండి. మార్చి మొదటి వారం నుంచి HMWSSB అందుబాటులోకి తెస్తున్న ‘పానీ యాప్’ ద్వారా నీటి వృథాను ఫొటో తీసి అప్‌లోడ్ చేయండి. అధికారులు IP అడ్రస్ ద్వారా నిందితులను గుర్తించి వెంటనే జరిమానా విధిస్తారు. ఇలా నీటిని ఆదా చేసినందుకు మీకు రూ.200ల నగదు ప్రోత్సాహకం కూడా లభిస్తుంది.