News April 25, 2024
సిక్కోలులో పొలిటికల్ హీట్

శ్రీకాకుళం జిల్లాలో పొలిటికల్ హీట్ నెలకొంది. అధికార, ప్రతిపక్ష నేతలిద్దరూ జిల్లాలోనే ఉన్నారు. నిన్న పాతపట్నం ప్రజాగళం సభలో పాల్గొన్న చంద్రబాబు.. ఈరోజు శ్రీకాకుళం మున్సిపల్ గ్రౌండ్ లో మహిళలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. సీఎం జగన్ కూడా శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నారు. మేమంతా బస్సు యాత్ర భాగంగా ఈరోజు ఎచ్చెర్ల నుంచి శ్రీకాకుళం బైపాస్ మీదుగా టెక్కలి చేరుకుని.. అక్కడ సభలో ప్రసంగించనున్నారు.
Similar News
News December 25, 2025
శ్రీకాకుళం గడ్డపై వాజ్‌పేయి ఎన్నికల ప్రచారం.. జ్ఞాపకాల నెమరువేత

1983 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ అటల్ బిహారీ వాజ్‌పేయి శ్రీకాకుళంలో పర్యటించిన అరుదైన జ్ఞాపకాలను జిల్లా బీజేపీ గుర్తు చేసుకుంది. అప్పట్లో హరిశ్చంద్రపురం నియోజకవర్గ అభ్యర్థి సంపతిరావు రాఘవరావు తరఫున ఆయన ప్రచారం చేశారు. కుష్బూ థాక్రేతో కలిసి జడ్పీ గెస్ట్ హౌస్‌లో బస చేసిన ఆయన ప్రసంగం ఆనాడు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఆ ఎన్నికల్లో రాఘవరావు 14శాతం ఓట్లు సాధించి మూడోస్థానంలో నిలిచారు.
News December 25, 2025
SKLM: రథసప్తమిపై ప్రజాభిప్రాయ సేకరణ రద్దు

రథసప్తమిపై ప్రజల అభిప్రాయ, సలహాల స్వీకరణ కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26న శ్రీకాకుళంలోని కలెక్టర్ కార్యాలయంలో జరగనున్న ఈ కార్యక్రమం కొన్ని అనివార్య కారణాల వలన రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా ప్రజలందరూ ఈ విషయం గమనించాలి కోరారు.
News December 25, 2025
శ్రీకాకుళం: 9 పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లికూతురు

ఇచ్ఛాపురంలో ఒక నిత్య పెళ్లికూతురు ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధిలో ఓ యువతి మరో మహిళ సహాయంతో వరుసగా 8 పెళ్లిళ్లు చేసుకుంది. ఇటీవల వివాహం అనంతరం అనుమానం రావడంతో బాధితుడు ఇచ్ఛాపురం పోలీసులను ఆశ్రయించాడు. దీంతో నిత్యపెళ్లికూతురుతో పాటు మరో మహిళ పరారీలో ఉన్నట్లు సమాచారం.బరంపురానికి చెందిన ఒక యువకుడిని పెళ్లిచేసుకుని మోసం చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని పోలీసులు తెలిపారు.


