News March 19, 2026

సిక్కోలులో సైబర్ మోసం

image

శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో సైబర్ మోసం ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. అరసవల్లిలో నివాసం ఉంటున్న విశ్రాంత బ్యాంకు ఉద్యోగి కె.జయశంకర్, భార్య పుష్పలత ఖాతా నుంచి రూ.2.49 లక్షలు మాయమయ్యాయి. బాధితులు వివరాలు మేరకు ఈనెల 11వ తేదీ రాత్రి బ్యాంకు లావాదేవీల యాప్‌కు సంబంధించి తమ మొబైల్‌కు వచ్చిన ఒక లింక్‌ను క్లిక్ చేయడంతో నగదు డెబిట్ అయినట్లు సందేశాలు రావడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు.

Similar News

News April 3, 2026

శ్రీకాకుళం: 5న R&B మినిస్టర్ రాక

image

రాష్ట్ర రహదారులు, భవనాలు(R&B) శాఖా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈనెల 5, 6వ తేదీల్లో శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. మంత్రి 5న జిల్లాకు వస్తారని చెప్పారు. సంతబొమ్మాళి మండలం మూలపేటలో గ్రీన్ ఫీల్డ్ పోర్ట్‌పై సమీక్షా సమావేశం 6న నిర్వహిస్తారన్నారు.

News April 3, 2026

శ్రీకాకుళంలో బీర్లు ఎక్కువగా తాగేస్తున్నారు..!

image

శ్రీకాకుళం జిల్లాలో 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు రూ.1207.91 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది. ఇందులో మద్యం బాక్సులు 16.97లక్షలు కాగా.. బీరు బాక్సులు రూ.8.06లక్షలు ఉన్నాయి. 2024-25లో రూ.1213.06కోట్ల విక్రయాలు జరిగాయి. గతంలో పోలిస్తే 2025-26లో అమ్మకాలు పెరగలేదు. 2024-25లో బీర్లు 5.19లక్షల బాక్సులు అమ్ముడుపోగా.. 2025-26లో ఆ సంఖ్య 8.06లక్షలకు పెరిగింది.

News April 3, 2026

రేపు శ్రీకాకుళం జిల్లాలో YCP పూజలు

image

తిరుమల పవిత్రతను కాపాడే దిశగా టీటీడీ ఛైర్మన్ పదవి నుంచి బీఆర్. నాయుడిని వెంటనే తొలగించాలని వైసీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ డిమాండ్ చేశారు. పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకు ఈనెల 4న జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు గురువారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.