News February 14, 2026
సిక్సర్లే కాదు ఒక మార్కు ప్రశ్నా ముఖ్యమే.. ట్వీట్ వైరల్

అండర్-19 ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ CBSE టెన్త్ పరీక్షలు రాయనున్న విషయం తెలిసిందే. దీనిపై ఓ జర్నలిస్ట్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. ‘మైదానంలో లాగే కంగారు పడకుండా 100 మార్కుల కోసం పూర్తి 180 నిమిషాలు వాడుకోవాలి. ఫోర్లు, సిక్సర్లలాగే (4, 6 మార్కులు) ఒక మార్కు ప్రశ్నలను కూడా వదలకూడదు’ అని సరదాగా ఆల్ ది బెస్ట్ చెప్పారు.
Similar News
News February 21, 2026
మానవ సహిత చంద్రుడి యాత్రకు రంగం సిద్ధం

మరో ప్రతిష్ఠాత్మక మూన్ మిషన్‌కు నాసా సిద్ధమవుతోంది. దాదాపు 50 ఏళ్ల తర్వాత మార్చి 6న <<18861755>>మానవులతో<<>> కూడిన ఆర్టెమిస్-2 రాకెట్‌ను ప్రయోగించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఫ్లోరిడాలో ప్యాడ్ వర్క్, రిహార్సల్స్, ఇతర కార్యకలాపాలు చేస్తున్నట్లు సీనియర్ అధికారి లోరీ గ్లేజ్ వెల్లడించారు. మిషన్‌లో భాగంగా ముగ్గురు అమెరికన్లు, ఒక కెనడియన్ వ్యోమగామిని చంద్రుడిపైకి తీసుకెళ్లి మళ్లీ భూమిపైకి తీసుకురానున్నారు.
News February 21, 2026
తొలి తెలుగు శిలా శాసనం.. చూశారా?

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా కడపలోని(AP) సి.పి. బ్రౌన్ గ్రంథాలయంలో ప్రదర్శించిన తొలి తెలుగు శిలా శాసనం నమూనా స్థూపం ఫొటో నెట్టింట వైరలవుతోంది. క్రీ.శ.575 కాలానికి చెందిన ఈ రేనాటి చోళుల శాసనం.. తెలుగు భాష ప్రాచీనతకు సజీవ సాక్ష్యం. మాతృభాషపై మమకారంతో పలువురు ఈ ఫొటోను షేర్ చేస్తూ మన భాషా వారసత్వాన్ని ఘనంగా చాటుతున్నారు. మన భాషకు ‘ప్రాచీన హోదా’ రావడంలో ఇటువంటి శాసనాలే కీలక పాత్ర పోషించాయి.
News February 21, 2026
260 పోస్టులు.. అప్లై చేశారా?

<


