News January 3, 2026

సిక్ లీవ్ అడిగితే లైవ్ లొకేషన్ షేర్ చేయమన్న మేనేజర్

image

తీవ్రమైన తలనొప్పితో సిక్ లీవ్ అడిగిన ఒక ఉద్యోగికి తన మేనేజర్ నుంచి వింత అనుభవం ఎదురైంది. లీవ్ కావాలంటే వాట్సాప్‌లో ‘లైవ్ లొకేషన్’ షేర్ చేయాలని మేనేజర్ పట్టుబట్టారు. దీంతో షాకైన సదరు ఉద్యోగి ఈ విషయాన్ని Reddit వేదికగా వాట్సాప్ స్క్రీన్‌షాట్లతో సహా పంచుకున్నారు. ఇది వ్యక్తిగత ప్రైవసీని ఉల్లంఘించడమేనంటూ నెటిజన్లు మేనేజర్ తీరును, అక్కడి వర్క్‌కల్చర్‌ను తప్పుబడుతున్నారు.

Similar News

News February 6, 2026

421 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

image

బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB) 421 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు నేటి నుంచి ఫిబ్రవరి 26వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, MBA/PGDM, CA/CFA/CMA అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అప్లికేషన్ స్క్రూట్నీ, ఆన్‌లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bankofbaroda.bank.in/

News February 6, 2026

KCR చిప్పకూడు తినకుండా అడ్డుకుంటోంది ఎవరు: రేవంత్

image

TG: రూ.లక్ష కోట్లతో కట్టిన ‘కాళేశ్వరం’ మూడేళ్లలో కూలిపోయిందని CM రేవంత్ విమర్శించారు. గోదావరి జలాల పేరుతో కల్వకుంట్ల కుటుంబం TGని దోచుకుందని ఆరోపించారు. BJPకి అధికారం ఇస్తే KCRను జైల్లో వేస్తామన్న కిషన్ రెడ్డి ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు. జైల్లో KCR చిప్పకూడు తినకుండా అడ్డుకుంటోంది ఎవరు? అని నిలదీశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఎక్కువ నిధులు వస్తాయని NZB సభలో తెలిపారు.

News February 6, 2026

మాకు పాఠాలు చెప్పొద్దు.. ట్రంప్‌కు ‘నోబెల్’ ప్రతిపాదనపై పోలండ్

image

ట్రంప్‌ను నోబెల్ బహుమతికి నామినేట్ చేయాలని US పంపిన ప్రతిపాదనలను పోలండ్ తిరస్కరించింది. అవార్డుకు ఆయన అర్హుడు కాదని పార్లమెంట్ స్పీకర్ జాజెస్టీ ప్రకటించారు. దీంతో ఇది ట్రంప్‌ను అవమానించడమేనని US దౌత్యవేత్త టామ్ రోజ్ విమర్శించారు. దీనికి పోలండ్ PM టస్క్ కౌంటరిచ్చారు. ‘అంబాసిడర్ రోజ్ మనం ఒకరినొకరు గౌరవించుకోవాలి. అంతేకానీ పాఠాలు చెప్పొద్దు. దౌత్యం ఎలా నిర్వహించాలో మాకు తెలుసు’ అని పేర్కొన్నారు.