News September 13, 2025

‘సిగాచీ’పై నివేదిక రెడీ.. ఇక సర్కారు నిర్ణయమే తరువాయి

image

పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 45 మంది మరణించిన ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ విచారణను పూర్తి చేసింది. ఈ మేరకు కమిటీ సభ్యులు కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ కు విచారణ నివేదికను అందజేశారు. ప్రమాదానికి కారణాలతోపాటు ఇటువంటి ప్రమాదాలు జరుగకుండా తీసుకోవాల్సిన చర్యలను కమిటీ సభ్యులు కూలంకుషంగా నివేదికలో పొందుపరిచారు.

Similar News

News September 13, 2025

మహబూబాబాద్: ‘అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి’

image

జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు. మండలాల తహశీల్దార్లు, స్థానిక పోలీస్, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, వైద్య శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. అవసరమైన చోట్ల ముందస్తు ప్రణాళికతో ప్రజలకు సహాయక చర్యలు అందించాలని కోరారు.

News September 13, 2025

వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన కామారెడ్డి కలెక్టర్

image

భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న కామారెడ్డిలోని పలు ప్రాంతాలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం పర్యటించి పరిశీలించారు. ఈ పర్యటనలో ఆయన హౌసింగ్ బోర్డ్ వైకుంఠధామం వద్ద అత్యవసరంగా నిర్మిస్తున్న రోడ్డు పనులను, అలాగే వాటర్ సప్లై ఫిల్టర్ బెడ్‌ను సందర్శించారు. నష్టం జరిగిన ప్రాంతాల్లో తక్షణమే పునరుద్ధరణ పనులను అత్యవసరంగా చేపట్టాలని ఆయన ఆదేశించారు.

News September 13, 2025

HYD: PM నేతృత్వంలో ఆయుర్వేదానికి ప్రాధాన్యత: కిషన్ రెడ్డి

image

హైదరాబాద్‌లో జరిగిన నేషనల్ ఆయుర్వేద కాన్ఫరెన్స్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. PM నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆయుర్వేదానికి దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత పెరిగిందన్నారు. వేల సంవత్సరాల క్రితం నుంచే అనేక వైద్య సమస్యలకు ఆయుర్వేదం పరిష్కారం చూపిందని తెలిపారు. పరిశోధన, అభివృద్ధి, ప్రపంచస్థాయిలో అవగాహన కోసం కేంద్రం వివిధ చర్యలు చేపడుతోందని వివరించారు.