News November 4, 2025
సిగాచీ బాధితులకు ₹కోటి పరిహారం ఎప్పుడు చెల్లిస్తారు: హైకోర్టు

TG: సిగాచీ పరిశ్రమ పేలుడు ఘటన బాధితులకు పరిహారం చెల్లింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. బాధితులకు ఇస్తామన్న ₹కోటి పరిహారం ఎప్పుడు చెల్లిస్తారని ఏఏజీని ధర్మాసనం ప్రశ్నించింది. మృతుల కుటుంబాలకు ₹25లక్షలు చెల్లించామని, కంపెనీ నుంచి మిగతా మొత్తం వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఏఏజీ తెలిపారు. 2 వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఫ్యాక్టరీ ఎండీకి నోటీసులు జారీ చేసింది.
Similar News
News November 4, 2025
‘ఇండియా’ గ్లోబల్ సూపర్ పవర్: ఇజ్రాయెల్ మంత్రి

ఇండియా ‘గ్లోబల్ సూపర్ పవర్’ కంట్రీ అని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియోన్ సర్ అభివర్ణించారు. 2 దేశాల సంబంధాలు గతంలో కన్నా మరింత బలపడ్డాయని NDTVతో చెప్పారు. డిఫెన్స్, ట్రేడ్, కౌంటర్ టెర్రరిజమ్, ట్రేడ్‌లలో తమ బంధాన్ని విస్తరించామన్నారు. హమాస్ దాడి సమయంలో మద్దతుగా నిలిచిన ఇండియాను ఎప్పుడూ గుర్తుంచుకుంటామని తెలిపారు. తమకు ముప్పుగా ఉన్న పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించలేమన్నారు.
News November 4, 2025
‘నీ కోసం నా భార్యను చంపేశా’.. మహిళలకు ఫోన్‌పేలో మెసేజ్

బెంగళూరులో కృతికా రెడ్డి అనే డాక్టర్ హత్య కేసులో సంచలన విషయం వెలుగులోకొచ్చింది. అధిక మోతాదులో మత్తు మందు ఇచ్చి ఆమెను హత్య చేసిన కేసులో భర్త మహేంద్రా రెడ్డి గత నెలలో అరెస్టయ్యాడు. ‘నీ కోసం నా భార్యను చంపేశా’ అని ఐదుగురు మహిళలకు ఫోన్‌పేలో అతడు మెసేజ్ చేశాడని పోలీసులు వెల్లడించారు. ఏప్రిల్‌లో హత్య తర్వాత కొన్నాళ్లకు ఇలా చేశాడని, పాత బంధాలను తిరిగి కొనసాగించేందుకు తీవ్రంగా ప్రయత్నించాడని చెప్పారు.
News November 4, 2025
ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు ఉదయం వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. KMM, నల్గొండ, SRPT, MHBD, WGL, హనుమకొండ, RR, వికారాబాద్, సంగారెడ్డి, MBNR, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. HYD, NRPT, GDL, జనగామ, SDPT, భువనగిరి, మేడ్చల్, MDK జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడొచ్చని తెలిపింది.


