News November 17, 2025

సిద్దపేట: ప్రతి శనివారం సీపీతో ‘ఫోన్-ఇన్’

image

ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు, సమస్యలు స్వీకరించి వాటిని పరిష్కరించే లక్ష్యంతో ప్రతి శనివారం ‘పోలీస్ కమిషనర్ తో ఫోన్-ఇన్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సిద్దిపేట సీపీ విజయ్ కుమార్ తెలిపారు. సమస్యలు, ముఖ్యమైన అంశాలపై నేరుగా కమిషనర్‌తో మాట్లాడవచ్చు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. ప్రజలు 8712667100, 8712667306, 8712667371 నంబర్లకు ఫోన్ చేయాలని సీపీ సూచించారు.

Similar News

News November 17, 2025

VZM: మహిళపై హత్యాయత్నం..నిందితుడికి ఆరేళ్ల జైలు శిక్ష

image

ఓ మహిళపై రాయితో దాడి చేసి, డబ్బులు దోచుకున్న కేసులో నిందితుడికి 6 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు కోర్టు నేడు తీర్పు వెల్లడించింది. SP దామోదర్ తెలిపిన వివరాల ప్రకారం..విజయనగరం బొగ్గులదిబ్బలోని మహిళపై ఫూల్‌బాగ్ కాలనీకి చెందిన అమర్నాథ్ హత్యాయత్నం చేసి, నగదు దోచుకొని పారిపోయాడు. దీనిపై 1వ పట్టణ PSలో 2024లో కేసు నమోదైంది. నేరం రుజువు కావడంతో కోర్టు నిందితుడికి జైలు శిక్షను ఖరారు చేసింది.

రాష్ట్రపతికి 16వ ఆర్థిక సంఘం నివేదిక

image

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు 16వ ఆర్థిక సంఘం తన నివేదికను అందించింది. నికర పన్ను ఆదాయాన్ని కేంద్ర, రాష్ట్రాలు, స్థానిక సంస్థలకు మధ్య పంపిణీ వాటాలు, ఇతర అంశాలపై ఈ సంఘం సిఫార్సులు చేస్తుంటుంది. సంఘం సిఫార్సులను ఆర్థిక శాఖ పరిశీలించి బడ్జెట్లో ప్రవేశపెడుతుంది. 2026 ఏప్రిల్1 నుంచి 5 ఏళ్లపాటు ఈ సంఘం సిఫార్సులు అమలవుతాయి. కాగా 15వ ఆర్థిక సంఘం పన్ను ఆదాయంలో 41% STATESకు కేటాయించేలా సిఫార్సు చేసింది.