News February 7, 2026

సిద్దవటం: రైలు ఢీకొని తల్లీకూతురు మృతి

image

సిద్దవటం మండలం కనుమల్లోపల్లి వద్ద రైలు ఢీకొని <<19077063>>ఇద్దరు వృద్ధ మహిళలు మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. మృతుల వివరాలను ఇవాళ సాయంత్రం రైల్వే పోలీసులు వెల్లడించారు. వీరు మాధవరం-1, 16వ వీధికి చెందిన రామలక్షుమ్మ (75), లక్షుమ్మ(50), వీరిద్దరు తల్లీకూతుళ్లుగా రైల్వే పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

Similar News

News February 13, 2026

విశాఖ: రేపు పాఠశాలల సెలవు రద్దు

image

జిల్లాలో ఫిబ్రవరి రెండో శనివారం ఇవ్వాల్సిన సెలవును రద్దు చేస్తూ డీఈవో ప్రేమ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల నెలకొన్న ‘మొంథా’ తుపాన్ ప్రభావంతో ఒక రోజు సెలవు ప్రకటించడంతో, ఆ రోజుకు బదులుగా రేపు పని దినంగా నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు సాధారణంగా నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. అధికారులు, ప్రధానోపాధ్యాయులు ఆదేశాలను అమలు చేయాలని సూచించారు.

News February 13, 2026

రాహుల్‌పై నోటీసు… స్పీకర్ నిర్ణయంపై ఆసక్తి

image

రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని BJP MP నిశికాంత్ దూబే సబ్‌స్టాంటివ్ మోషన్ నోటీసు ఇవ్వడం తెలిసిందే. దీనిపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. దీన్ని ఎథిక్స్ కమిటీకి అప్పగించడంపై స్పీకర్ నిర్ణయించాలి. అది విచారించి ఇచ్చిన సిఫార్సును సభ ఆమోదానికి పెట్టాలి. సభ సాధారణ మెజారిటీతో ఆమోదిస్తే చర్య చేపడతారు. గతంలో మొహువా మొయిత్రా (TMC MP)ని ఎథిక్స్ కమిటీ సిఫార్సుతో బహిష్కరించారు.

News February 13, 2026

విజయోత్సవ ర్యాలీలు, సభలకు అనుమతి లేదు: సంగారెడ్డి ఎస్పీ

image

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద 163 BNSS అమలులో ఉందని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందని విజయోత్సవ ర్యాలీలు, డీజేలకు అనుమతి లేదన్నారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.