News November 6, 2025

సిద్దిపేటలో ఈనెల 7న మినీ జాబ్ మేళా

image

సిద్దిపేటలోని సెట్విన్ కేంద్రంలో ఈ నెల 7న మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి రాఘవేందర్ తెలిపారు. ఈ మేళాలో హైదరాబాద్‌లోని అపోలో ఫార్మసీలో పలు ఖాళీ పోస్టుల కోసం ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. SSC, ఇంటర్, డిగ్రీ అర్హత ఉన్న విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.

Similar News

News November 6, 2025

డెయిరీఫామ్‌తో రూ.15 లక్షలు నష్టపోయారు..

image

TG: రెండేళ్ల క్రితం డెయిరీఫామ్‌ ప్రారంభించి రూ.15లక్షలుపైగా నష్టపోయారు కామారెడ్డి(D) పెద్దమల్లారెడ్డికి చెందిన ఐదుగురు మిత్రులు. రూ.27 లక్షల పెట్టుబడి, 17 గేదెలతో ఫామ్‌ ప్రారంభించారు. గేదెల ఎంపికలో తప్పులు, అనుభవలేమి, ఊహించని ఖర్చులతో 6 నెలల క్రితం ఫామ్‌ మూసేశారు. అందుకే డెయిరీఫామ్ పెట్టేముందు పూర్తిగా తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ✍️ పాడి, వ్యవసాయ సమాచారానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News November 6, 2025

కరివేపాకుతో మెరిసే చర్మం

image

కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీమైక్రోబయల్ వంటి గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతో పాటు, చర్మాన్ని మెరిసేలా చేస్తాయని నిపుణులంటున్నారు. * కరివేపాకు, పాలతో చేసిన పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసుకోవడం వల్ల మచ్చలు, ముడతలు తగ్గుతాయి. * కరివేపాకు మరిగించిన నీళ్లలో కొద్దిగా శనగపిండి, నిమ్మరసం కలిపి కూడా ముఖానికి అప్లై చేస్తే చర్మం మెరుస్తుంది.

News November 6, 2025

కొత్త రెవెన్యూ డివిజన్‌గా ‘మడకశిర’

image

రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మడకశిరను కొత్త రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసేందుకు సానుకూలత వ్యక్తం చేసింది. పాలనా సౌలభ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకుంది. మడకశిర, గుడిబండ, రోళ్ల, అమరాపురం, అగలి మండలాలతో మడకశిర కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు కానుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ఇక సత్యసాయి జిల్లా కేంద్రంగా పుట్టపర్తి కొనసాగనుంది.