News October 29, 2025
సిద్దిపేటలో కంట్రోల్ రూమ్.. ‘ఎమర్జెన్సీ ఉంటే కాల్ చేయండి’

భారీ వర్షాల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. వర్షాల కారణంగా ఏవైనా ఇబ్బందులు తలెత్తితే ఎమర్జెన్సీ నంబర్ 08457-230000కు కాల్ చేయాలని సూచించారు. బుధవారం ఆర్డీఓలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు.
Similar News
News October 30, 2025
కాగజ్‌నగర్: సైబర్ నేరగాడి అరెస్ట్

కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి ఆన్ లైన్ ద్వారా రూ.45790 పోగొట్టుకొని ఫిర్యాదు చేసినట్లు CI కుమారస్వామి తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు D-4C బృందం ద్వారా సాంకేతిక ఆధారాలను సేకరించి MPకి చెందిన ఆశిష్ కుమార్ దోహార్‌ను పట్టకున్నారు. అతడి ఖాతాలోని రూ.34537.38 ఫ్రీజ్ చేసినట్లు CI వెల్లడించారు.
News October 30, 2025
దక్షిణాఫ్రికా సిరీస్‌కు శ్రేయస్ దూరం?

టీమ్ ఇండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ మరో 2 నెలలపాటు కాంపిటీటివ్ క్రికెట్‌కు దూరమయ్యే అవకాశం ఉందని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో నవంబర్, డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగే 3 మ్యాచుల వన్డే సిరీస్‌కు ఆయన దూరం కానున్నట్లు తెలుస్తోంది. జనవరిలో న్యూజిలాండ్ జరిగే ODI సిరీస్ నాటికి ఫిట్‌నెస్ సాధించే ఛాన్స్ ఉంది. ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో క్యాచ్ అందుకుంటూ ఆయన గాయపడిన సంగతి తెలిసిందే.
News October 30, 2025
కామారెడ్డి: ఉజ్వల కనెక్షన్లకు దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్

కామారెడ్డి జిల్లాకు కొత్తగా 284 ఉజ్వల కనెక్షన్లు మంజూరైనట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. బుధవారం ఉజ్వల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బిపిఎల్ కుటుంబాలు, గ్యాస్ కనెక్షన్ లేనివారు మాత్రమే అర్హులన్నారు. అర్హత గల లబ్ధిదారులు వెంటనే డిస్ట్రిబ్యూటర్ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించుకోవాలని సూచించారు.


