News October 28, 2025
సిద్దిపేటలో ధాన్యం తడిసి ముద్ద.. అన్నదాతల ఆందోళన

సిద్దిపేట జిల్లాలోని నంగునూర్ మండలంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి కోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. నేడు కూడా వర్ష సూచన ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కవర్లు కప్పినా నీరు చేరి ధాన్యం తడిసి ముద్దయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యం మొలకెత్తితే నష్టం వాటిల్లుతుందని రైతులు భయపడుతున్నారు. ప్రభుత్వం తేమ శాతం, నిబంధనలను సడలించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
Similar News
News October 28, 2025
అనకాపల్లి: పెట్టుబడి పేరుతో రూ.13.62 లక్షలు కొట్టేసింది

ఓ సంస్థలో పెట్టుబడి పెడితే తక్కువ కాలంలో రెట్టింపు ఆదాయం వస్తుందని అనకాపల్లికి చెందిన ఎలక్ట్రీషియన్ రమణబాబును మోసం చేసి రూ.13.62 లక్షలు కాజేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆగస్టు 17న రమణబాబుకు ఓ మహిళ ఫోన్ చేసి తాను సూచించిన సంస్థలో పెట్టుబడులు పెట్టాలని నమ్మించినట్లు సీఐ ప్రేమ్ కుమార్ సోమవారం తెలిపారు.రమణబాబు ఆమె ఖాతాకు డిజిటల్ ట్రాన్స్‌ఫర్ చేశారు. తర్వాత మోసపోయినట్లు గ్రహించాడు.
News October 28, 2025
VKB: ఓయూపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి

ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని (ఓయూ) అగ్రగామి విద్యాసంస్థగా తీర్చిదిద్దాలన్న సీఎం రేవంత్‌రెడ్డి సంకల్పంతో, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి కమిటీ ఓయూలో పర్యటించింది. సీఎం ఇచ్చిన హామీల అమలు దిశగా ప్రణాళికలను సిద్ధం చేసేందుకు సీఎం సలహాదారు కె.కేశవరావు నేతృత్వంలోని బృందం క్యాంపస్‌లోని పలు కళాశాలలు, మౌలిక వసతులను పరిశీలించింది. హాస్టళ్లు సహా ఇతర మౌలిక సదుపాయాలపై బృందం క్షేత్రస్థాయిలో తనిఖీ చేసింది.
News October 28, 2025
భారీ వర్షాలు.. అన్నదాతలకు సూచనలు

భారీ వర్షం సమయంలో నీళ్లను బయటకు పంపాలని పొలానికి వెళ్లొద్దు. వర్షం పూర్తిగా తగ్గిన తర్వాత పరిస్థితిని బట్టి వెళ్లండి. నదులు, వాగులు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున వాటి తీరం వద్దకు వెళ్లొద్దు. నీరు ప్రవహిస్తున్న రహదారులు, వంతెనలను దాటేందుకు ప్రయత్నించవద్దు. విద్యుత్ మోటార్లు, స్తంభాలను తాకవద్దు. వాటి దగ్గరకు వెళ్లవద్దు. పిడుగు పడే సమయంలో చెట్లకింద ఉండొద్దు. పిడుగులు పడేటప్పుడు ఫోన్ స్విచ్ఛాఫ్ చేయండి.


