News October 24, 2025
సిద్దిపేటలో ప్రైవేట్ ట్రావెల్స్, స్కూల్ బస్సులు సేఫేనా..?

కర్నూల్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పలువురు అక్కడికక్కడే అగ్నికి ఆహుతి అయ్యారు. ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలో ఉన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులు, స్కూల్ బస్సులు సేఫేనా అన్న ప్రశ్న ప్రజల ఆలోచనల్లో మెదులుతోంది. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా సీరియస్ అయ్యారు. ప్రమాదంపై విచారణ జరపాలని ఆదేశించారు. సిద్దిపేట ప్రైవేట్, స్కూల్ బస్సులపై ట్రాన్స్‌పోర్ట్ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలంటున్నారు.
Similar News
News October 25, 2025
నేడు ఆసీస్‌తో భారత్ చివరి వన్డే

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత్ ఇవాళ చివరిదైన 3వ వన్డే ఆడనుంది. తొలి 2 వన్డేల్లో ఆసీస్ గెలిచి సిరీస్ కైవసం చేసుకోగా, నేటి మ్యాచ్ నామమాత్రం కానుంది. దీంతో ఇరుజట్లలో కొత్త ప్లేయర్లు ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అటు ఇవాళ సిడ్నీలో మ్యాచ్ జరగనుండగా టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. ఉదయం 9గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ వన్డేలోనైనా భారత్ తిరిగి పుంజుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆటకు వర్షం ముప్పు లేదు.
News October 25, 2025
దూసుకొస్తున్న తుఫాన్.. ఆ జిల్లాల్లో 2 రోజులు సెలవులు?

AP: రాష్ట్రానికి ‘మొంథా’ తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ ఏడాది ఇదే బలమైన తుఫాన్ అని, ఈ నెల 28 అర్ధరాత్రి లేదా 29 తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉందన్నారు. 26 నుంచి 4 రోజుల పాటు ఏపీకి రెడ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా 28, 29 తేదీల్లో తీర ప్రాంత జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇవ్వాలని అధికారులు సూచించారు. నేడు, రేపు చాలాచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి.
News October 25, 2025
లవ్ మ్యారేజ్ చేసుకుంటా: అనుపమ

కెరీర్ ప్రారంభంలో ట్రోల్స్ వల్ల తాను బాధపడినట్లు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చెప్పారు. బిగినింగ్‌లో ఓ స్కూల్ ఈవెంట్‌కి వెళ్లిన ఫొటోలు వైరలవ్వగా డబ్బులిస్తే పాన్ షాపు ఈవెంట్లకూ వెళ్తారని తనపై ట్రోల్స్ వచ్చినట్లు ఓ ఇంటర్వ్యూలో ఆమె తెలిపారు. లవ్ మ్యారేజ్ చేసుకుంటారా అని ప్రశ్నించగా ఫ్యామిలీ అనుమతితో చేసుకుంటానని ఆమె బదులిచ్చారు. తాను ప్రత్యేకంగా ఎలాంటి డైట్ పాటించనని, నచ్చిన ఫుడ్ తింటానని చెప్పారు.


