News December 15, 2025

సిద్దిపేటలో బీఆర్ఎస్ 78 సీట్లు కైవసం

image

సిద్దిపేట నియోజకవర్గంలో మొత్తం 91 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. బీఆర్ఎస్ 78 సీట్లు కైవసం చేసుకోగా అధికార కాంగ్రెస్ 5 పంచాయతీ స్థానాలు వెల్కటూర్, బూరుగుపల్లి, రాంపూర్, నాగరాజు పల్లి, బచ్చాయిపల్లిలో గెలిచింది. బీజేపీ 2 పంచాయతీ స్థానాలు చందలా పూర్, నాంచారుపల్లి గెలవగా ఇండిపెండెంట్ -6 తడకపల్లి, అల్లీపూర్, కోదండరావుపల్లి, సిద్దన్నపేట, ఖానాపూర్, రాజ్ గోపాల్ పేట్ గెలుపొందారు.

Similar News

News December 21, 2025

మంచిర్యాల: 3,700 కేసులు పరిష్కారం

image

మంచిర్యాల జిల్లాలోని అన్ని న్యాయస్థానాలలో ఆదివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 9 లోక్ అదాలత్ బెంచ్‌లలో 3,700 కేసులు పరిష్కరించినట్లు జిల్లా అదనపు న్యాయమూర్తి లాల్ సింగ్ శ్రీనివాస నాయక్ తెలిపారు. 15 సివిల్ ధావాలు, 5 వాహన పరిహారం, 3, 650, క్రిమినల్, 33 సైబర్ క్రైమ్, 75 ప్రీలిటిగేషన్ కేసులు పరిష్కారమయ్యాయని వెల్లడించారు.

News December 21, 2025

బీజేపీకి భారీగా విరాళాలు

image

2024-25లో రాజకీయ పార్టీలకు ₹3,811 కోట్ల డొనేషన్లు వచ్చాయి. దేశవ్యాప్తంగా 9 ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా ఇవి అందాయి. బీజేపీకి ఏకంగా ₹3,112 కోట్లు (82%) రావడం గమనార్హం. కాంగ్రెస్‌కు ₹299 కోట్లు(8%), ఇతర పార్టీలకు ₹400 కోట్లు (10%) వచ్చాయి. పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళాలివ్వడాన్ని సుప్రీంకోర్టు గతేడాది రద్దు చేసిన విషయం తెలిసిందే. 2023-24లో ₹1,218 కోట్ల విరాళాలు వచ్చాయి.

News December 21, 2025

MHBD: ఈనెల 22 నుంచి నట్టల నివారణ మందు పంపిణీ

image

జీవాల్లో అధిక మాంస ఉత్పత్తి లక్ష్యంగా ఈనెల 22 నుంచి 31 వరకు అన్ని మండలాల్లో గొర్రెలకు, మేకలకు నట్టల నివారణ మందు కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు జిల్లా పశువైద్యాధికారి డా.కిరణ్ కుమార్ తెలిపారు. నట్టలనివారణ మందును తాగిపిస్తే జీవాల్లో వ్యాధి నిరోధక శక్తి పెరిగి, జీవాలు ఆరోగ్యంగాను, సకాలంలో అధిక బరువు తూగుతాయని తెలిపారు.