News October 28, 2025
సిద్దిపేటలో యాదాద్రి వాసికి జాక్‌పాట్

తెలంగాణ రాష్ట్రంలో మద్యం టెండర్ల లక్కీ డ్రాలో భువనగిరి జిల్లా చల్లూరుకి చెందిన భీమగాని బాలనరసయ్య అదృష్టం వరించింది. సిద్దిపేట జిల్లా పరిధిలో ఏకంగా ఆరు మద్యం దుకాణాలను ఆయన దక్కించుకున్నారు. రాయపోల్, అంబర్‌పేట్, చిన్నకోడూరు, పుదూర్, మజీద్‌పూర్‌లోని వైన్స్ షాపులు కుటుంబ సభ్యులు, బంధువుల పేరిట లక్కీ డ్రా ద్వారా వచ్చాయని నరసయ్య తెలిపారు.
Similar News
News October 28, 2025
కోనసీమలో విషాదం.. చెట్టు కూలి మహిళ మృతి

తుఫాను ప్రభావంతో కోనసీమలో ఈదురు గాలుల తీవ్రత పెరిగింది. ఈ నేపథ్యంలో మామిడికుదురు మండలంలో మంగళవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మాకనపాలెంలోని ఓ ఇంటి ఆవరణలో తాటిచెట్టు పడిపోవడంతో గూడపల్లి వీరవేణి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 28, 2025
ఈవీఎం గోదాముకు పటిష్ట భద్రత: కలెక్టర్

విజయవాడ పరధిలోని గొల్లపూడిలో ఈవీఎం, వీవీప్యాట్ గోదామును కలెక్టర్ లక్ష్మీశ మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు. గోదాముకు పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని, అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆయన ఆదేశించారు. పర్యవేక్షణ రిజిస్టర్‌లో కలెక్టర్ సంతకం చేశారు.
News October 28, 2025
KMR: ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్..దరఖాస్తు చేసుకోండి

కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అందించే ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకానికి నిధులు మంజూరయ్యాయి. అర్హులైన వారు tgepass.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుక బడిన తరగతుల అభివృద్ధి అధికారి పేర్కొన్నారు. దరఖాస్తు పత్రాన్ని సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సమర్పించాలని కోరారు.


