News March 10, 2025
సిద్దిపేటలో విషాదం.. తల్లి తిట్టిందని బాలుడి సూసైడ్

క్షణికావేశంలో ఓ బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డిన ఘటన ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. గౌరారం SI కరుణాకర్ రెడ్డి వివరాలిలా.. వర్గల్ మం. చాంద్‌ఖాన్ మక్తాకు చెందిన విజయేందర్ రెడ్డి(15) చౌదర్‌పల్లి పాఠశాలలో టెన్త్ చదువుతున్నాడు. విజయేందర్ గురువారం సాయంత్రం పొలం వద్దకు వెళ్లగా ఎందుకు తిరుగుతున్నావని తల్లి కనకవ్వ మందలించింది. దీంతో మనస్తాపంతో పురుగు మందు తగగా చికిత్స పొందుతూ అదివారం మృతి చెందాడు.
Similar News
News March 10, 2025
శ్రీదేవి చివరి సినిమాకు సీక్వెల్.. హీరోయిన్ ఎవరంటే?

శ్రీదేవి నటించిన చివరి సినిమా ‘MOM’కు సీక్వెల్ తీయబోతున్నట్లు ఆమె భర్త, నిర్మాత బోనీ కపూర్ ప్రకటించారు. ఇందులో తమ రెండో కూతురు ఖుషీ కపూర్ ప్రధాన పాత్రలో కనిపిస్తారని పేర్కొన్నారు. ‘ఖుషీ తన తల్లి అడుగుజాడల్లో నడవడానికి ప్రయత్నిస్తోంది. నటించిన అన్ని భాషల్లో శ్రీదేవి టాప్ హీరోయిన్‌గా ఎదిగారు. జాన్వీ, ఖుషీ కపూర్ కూడా ఆ స్థాయిలో సక్సెస్ అవుతారని నమ్ముతున్నా’ అని ఓ ఈవెంట్‌లో పేర్కొన్నారు.
News March 10, 2025
జడేజా భార్యపై ప్రశంసలు!

న్యూజిలాండ్‌ను టీమ్ఇండియా ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అనంతరం జట్టుతో కుటుంబసభ్యులు తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన భార్య రివాబా జడేజా, కూతురుతో కలిసి ట్రోఫీతో ఫొటోలు దిగారు. అయితే, విదేశాల్లో జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌కూ సంప్రదాయబద్ధంగా చీరలో వచ్చి రివాబా అందరి దృష్టినీ ఆకర్షించారు. నెట్టింట ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
News March 10, 2025
BREAKING: తాండూరులో హెడ్ కానిస్టేబుల్ మృతి

వికారాబాద్ జిల్లా తాండూరు సబ్ డివిజన్ పరిధి కరణ్‌కోట్ హెడ్ కానిస్టేబుల్ రాంచందర్ ఈరోజు కన్నుమూశారు. గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. ఈ ఘటన సోమవారం జరిగింది. తాండూరు పట్టణం సీతారాంపేట్‌కు చెందిన రాంచందర్ పోలీసుశాఖలో పనిచేస్తున్నారు. గతంలో తాండూరు డీఎస్పీ కార్యాలయంలో రైటర్‌గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం రూరల్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో చనిపోయారు.