News March 12, 2026
సిద్దిపేటలో 109 మొబైల్ ఫోన్లు రికవరీ: సీపీ

పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సిద్దిపేట పోలీసులు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ఆదేశాలతో CEIR పోర్టల్ ద్వారా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి రూ.10 లక్షల విలువైన 109 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ పోయిన వారు www.ceir.gov.in లో నమోదు చేసుకుంటే తిరిగి పొందే అవకాశం ఉంటుందని సీపీ తెలిపారు. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు 200 ఫోన్లు రికవరీ చేసినట్లు వెల్లడించారు.
Similar News
News April 13, 2026
ఊసరవెల్లికే పోటీ.. 2 రోజుల్లో 3 పార్టీల నుంచి నామినేషన్

గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అరుదైన ఘటన జరిగింది. భరత్ సింగ్ వాఖ్లా అనే వ్యక్తి ఊసరవెల్లినే డామినేట్ చేస్తూ పార్టీల కండువాలను మార్చేశారు. దాహోద్(D) పైపెరో స్థానానికి రెండు రోజుల్లో 3 జాతీయ పార్టీల(BJP, INC, AAP) నుంచి నామినేషన్ వేశారు. ఎల్లుండితో విత్‌డ్రా గడువు ముగియనుండగా ఆయన అంతిమంగా ఏ పార్టీలో ఉంటారనేది ఆసక్తికరం. భరత్ 2017లో కాంగ్రెస్, 2022లో ఆప్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
News April 13, 2026
తుంగభద్ర డ్యాం: మే చివరినాటికి పనులన్నీ పూర్తి

తుంగభద్ర జలాశయం 33 కొత్త గేట్లతో సరికొత్త రూపు సంతరించుకుంటోంది. దశాబ్దాల కాలం నాటి పాత గేట్ల స్థానంలో రూ.47 కోట్లతో ఆధునిక గేట్లను బిగిస్తున్నారు. ఇప్పటికే 26 గేట్లు బిగించి, 22 గేట్లకు ట్రయల్ రన్ పూర్తి చేశారు. వచ్చే ఖరీఫ్ నుంచి జలాశయం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. మే చివరి నాటికి పనులన్నీ పూర్తి చేస్తామని ఇంజినీర్లు వెల్లడించారు.
News April 13, 2026
ఖైరతాబాద్ మైనారిటీ గురుకులానికి 2 స్టేట్ ర్యాంకులు

ఇంటర్ ఫలితాల్లో ఖైరతాబాద్ మైనారిటీ గురుకుల(TMREIS) విద్యార్థులు రెండు స్టేట్ ర్యాంకులు సాధించారు. కళాశాలకు చెందిన MD ఫర్హాన్ CEC సెకండ్ ఇయర్‌లో 988 మార్కులతో స్టేట్ 1st ర్యాంక్ సాధిస్తే, ఇదే కళాశాలకు చెందిన హర్ష HEC ఫస్ట్ ఇయర్‌లో 492 మార్కులతో స్టేట్ 2nd ర్యాంక్ సాధించాడు. ఈ ఫలితాలు మైనారిటీ గురుకులాల పనితీరుకు నిదర్శనమని కళాశాల ప్రిన్సిపల్ హబీబ్ హర్షం వ్యక్తంచేశారు.


