News February 4, 2025
సిద్దిపేటలో 14 మందికి జరిమానా
సిద్దిపేట ట్రాఫిక్ పోలీసుల వాహన తనిఖీలలో మద్యం తాగి వాహనాలు నడిపిన 14 మందికి రూ.22,500 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి కాంతారావు తీర్పునిచ్చినట్లు ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. కొన్ని రోజుల క్రితం పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా, ఎంపీడీవో ఆఫీస్ చౌరస్తా, రాజీవ్ రహదారిపై వాహనాలు తనిఖీలు నిర్వహించి 14 మందిని అరెస్ట్ చేశారు. వారిని సోమవారం కోర్టులో హాజరుపర్చగా జరిమానా విధించినట్లు వెల్లడించారు.
Similar News
News February 4, 2025
8th, ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు
AP: గురుకుల విద్యాలయాలలో 2025-26కుగాను ఎనిమిదో తరగతి, ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. 7th, టెన్త్ ఉత్తీర్ణులైన వారు మార్చి 2వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. కుటుంబ వార్షికాదాయం రూ.లక్ష లోపు ఉండాలి. మార్చి 4న హాల్‌టికెట్లు విడుదలవుతాయి. 9న పరీక్ష ఉంటుంది. 25న మెరిట్ జాబితా ప్రకటిస్తారు. ఏప్రిల్ 11, 21 తేదీల్లో రెండు దశల కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. పూర్తి వివరాల కోసం <
News February 4, 2025
కులగణన: నేడు క్యాబినెట్, అసెంబ్లీ సమావేశం
TG: సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం ఇవాళ ఉ.10 గంటలకు సమావేశం కానుంది. కుల గణన సర్వే నివేదికకు ఆమోదం తెలపనుంది. ఉ.11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై సర్వేపై చర్చించనుంది. కులగణన తప్పుల తడక అంటూ బీసీ సంఘాలు, విపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో సభ వాడీవేడిగా జరిగే అవకాశం ఉంది. కాగా ఈ నెల 15 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
News February 4, 2025
సంగారెడ్డి: ఉపాధ్యాయులకు సీసీఎల్ మంజూరు
సంగారెడ్డి జిల్లాలోని ఉపాధ్యాయులకు ఐదు రోజుల సీసీఎల్ మంజూరు చేస్తూ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు. సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా సాధారణ సెలవు దినాల్లో విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు ఇవి వర్తిస్తాయన్నారు. దీంతో వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు డీఈవోకు కృతజ్ఞతలు తెలిపారు.