News February 28, 2025
సిద్దిపేటలో MLC ఓటింగ్ ఇలా..

పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు తెలిపారు. సిద్దిపేటలో టీచర్ ఎమ్మెల్సీ ఓటింగ్ 94.83% అంటే ఓటర్లు 3212 ఉండగా 3046 మంది పురుషులు, 1925 మహిళలు 1121 వినియోగించుకున్నారు. అలాగే పట్టబద్రుల ఓటింగ్ 72.83% జరగగా 32589 మంది ఓటర్లకు 23736 మంది పురుషులు 16143, మహిళలు 7593 ఓటు హక్కు వినియోగించుకున్నారని అధికారులు తెలిపారు.
Similar News
News February 28, 2025
తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వాణీ తల్లి కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాలో వెల్లడించారు. తమ జీవితంలోకి చిన్నారి రాబోతున్నట్లు హింట్ ఇస్తూ ఫొటోను పోస్ట్ చేశారు. నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాను ఈ అమ్మడు 2023లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఈ బ్యూటీ భరత్ అనే నేను, వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్ సినిమాల్లో నటించారు.
News February 28, 2025
HYD: కేంద్రమంత్రికి సీఎం బహిరంగ లేఖ

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి 9 పేజీలతో లేఖ రాశారు. పలు ప్రభుత్వ విజ్ఞప్తులను సీఎం లేఖలో ప్రస్తావించారు. అందులో కీలకంగా తెలంగాణను కేంద్రం పట్టించుకోవడంలేదని పేర్కొన్నారు. రాష్ట్రానికి నిధుల మంజూరు బాధ్యత కిషన్ రెడ్డిదేనన్నారు. ఆయన కేంద్ర మంత్రిగా ఉండగానే చెన్నై, బెంగళూరు మెట్రో విస్తరణకు ఆమోదం వచ్చిందని హైదరాబాద్ మెట్రో విస్తరణకు పలు విజ్ఞప్తులను పట్టించుకోలేదని వెల్లడించారు.
News February 28, 2025
ఆ రేపిస్టుల కన్నా పిశాచాలే మేలేమో!

ఈ దుర్యోధన, దుశ్శాసన, దుర్వినీత లోకంలో.. రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో.. మరో మహాభారతం, ఆరవ వేదం, మానభంగ పర్వంలో మాతృ హృదయ నిర్వేదం.. అని వేటూరి రాసింది అక్షరసత్యం. రేపిస్టుల దారుణాలను చూస్తే వారి కన్నా పిశాచాలే మేలేమో అనిపిస్తోంది. పుణేలో బస్సులో యువతిపై అత్యాచారం. గ్వాలియర్లో ఐదేళ్ల <<15601122>>చిన్నారి<<>>పై అఘాయిత్యం. రక్తపు మడుగులో పడున్న ఆమె మర్మాంగాలకు 29 కుట్లు పడ్డాయి. ఏం చేస్తే వీళ్లు మారేను!