News March 8, 2025

సిద్దిపేట: అక్క చెల్లెళ్లు అదుర్స్.. అంతా డాక్టర్స్

image

ఒక సామాన్య కుటుంబానికి చెందిన నలుగురు అక్కాచెల్లెళ్లు MBBS చదువుతూ అందరి మన్ననలు పొందుతున్నారు. వివరాలు.. సిద్దిపేటలోని నర్సాపూర్‌కు చెందిన కొంక రామచంద్రం (టైలరింగ్) శారద దంపతులకు నలుగురు కుమార్తెలు మమత, మాధురి, రోహిణి, రోషిణి ఉన్నారు. వారిలో పెద్ద కూతురు మమత 2018-24లో MBBS పూర్తి చేయగా ఆమె చెల్లెళ్లు అదే బాట పట్టారు. మాధురి ఫైనల్ ఇయర్, రోహిణి ఫస్ట్ ఇయర్ చదువుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

Similar News

News December 6, 2025

సెల్యూట్ డాక్టర్.. 1.2లక్షల మందికి ఉచితంగా..!

image

నిస్సహాయులకు వైద్యం అందని చోట డాక్టర్ సునీల్ కుమార్ హెబ్బీ ఆశాదీపంగా మారారు. పేరు కోసం కాకుండా సేవ చేయడానికి తన కారును ‘సంచార క్లినిక్‌’గా మార్చుకున్నారు. బెంగళూరు వీధుల్లోని పేదలకు ఇంటి వద్దే ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. ఒక రోడ్డు ప్రమాదంతో మొదలైన ఈ గొప్ప ప్రయాణం ఇప్పటికే 1.2 లక్షల మందికిపైగా ప్రాణాలను కాపాడింది. వైద్య పరికరాలతో నిండిన ఆయన కారు ఎంతో మందికి కొత్త జీవితాన్నిస్తోంది.

News December 6, 2025

గ్లోబల్ సమ్మిట్‌కు ప్రత్యేక విమానాలు: భట్టి

image

TG: ఈ నెల 8, 9న ఫ్యూచర్ సిటీలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ సదస్సుకు వచ్చే ప్రముఖుల కోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కాగా ఇండిగో విమానాల రద్దు నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో సమ్మిట్‌కు వచ్చే వారు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

News December 6, 2025

వనపర్తి: నిబంధనలకు లోబడి పని చేయాలి: అదనపు కలెక్టర్

image

వనపర్తి జిల్లాలోని మీసేవ కేంద్రాల నిర్వాహకులు నిబంధనలను అతిక్రమించి ప్రజలు, రైతులు, విద్యార్థుల నుంచి అదనపు వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ హెచ్చరించారు. శనివారం ఈడీఎం వెంకటేష్ ఆధ్వర్యంలో జిల్లాలోని మీసేవ కేంద్రాల నిర్వాహకులతో అదనపు కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఉన్న 72 మీసేవ కేంద్రాల నిర్వాహకులు నిబంధనలకు లోబడి పని చేయాలని కలెక్టర్ సూచించారు.