News January 30, 2025
సిద్దిపేట: అఘోరీపై కేసు నమోదు

కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయంలో అఘోరీ హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. కత్తులతో భక్తులపై దాడి చేయడంతో అక్కడ ఉన్న భక్తులు భయందోళనకు గురయ్యారు. అనంతరం ఆలయ సభ్యులు అఘోరీకి దర్శనం చేయించి పంపించినా.. భక్తులపై కత్తితో దాడి చేయడంపై సిద్దిపేట సీపీ అనురాధ సీరియస్ అయ్యారు. సీపీ ఆదేశాలతో బుధవారం అఘోరీపై చేర్యాల పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News September 18, 2025
ప.గో: ఈ నెల 19న డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని మెగా డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 19న అమరావతిలో నియామక పత్రాలు అందజేస్తారని జిల్లా విద్యాశాఖాధికారిని ఎం. వెంకట లక్ష్మమ్మ తెలిపారు. ఆ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. అభ్యర్థులందరూ 18న సాయంత్రం 4 గంటలకు ఏలూరులోని రిసీవింగ్ సెంటర్‌కు చేరుకోవాలని, అక్కడి నుంచి 19న అమరావతికి బయలుదేరుతారని ఆమె వెల్లడించారు.
News September 18, 2025
ఉత్తరాఖండ్‌లో పేరేచర్ల యువకుడి మృతి

ఉత్తరాఖండ్‌లోని రుషికేశ్ ఎయిమ్స్‌లో వైద్య విద్య అభ్యసిస్తున్న మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామానికి చెందిన జగదీశ్‌బాబు (30) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కష్టపడి జాతీయ స్థాయిలో మంచి ర్యాంకు సాధించి, వైద్య సీటు పొందిన జగదీశ్ మృతి పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరయ్యారు. బుధవారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
News September 18, 2025
యాదాద్రి శ్రీవారికి భారీగా నిత్య ఆదాయం

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్య ఖజానాకు బుధవారం సమకూరిన ఆదాయ వివరాలు ఆలయ ఈవో వెంకట్రావు వెల్లడించారు. అందులో ప్రధాన బుకింగ్, ప్రత్యేక దర్శనాలు, ప్రసాద విక్రయాలు, యాదరుషి నిలయం, కళ్యాణకట్ట వ్రతాలు కార్ పార్కింగ్ అన్నదాన విరాళాలు తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.42,98,522
ఆదాయం వచ్చింది.