News December 18, 2025

సిద్దిపేట అటవీ శాఖ అధికారిగా పద్మజారాణి

image

సిద్దిపేట జిల్లా అటవీ శాఖ అధికారిగా పద్మజారాణి బాధ్యతలు స్వీకరించారు. గతంలో యాదాద్రి జిల్లాలో పనిచేసిన ఆమె బదిలీపై ఇక్కడికి వచ్చారు. గురువారం ఫారెస్ట్ సెక్షన్ అధికారులు ముజ్జుదీన్, సాక్వత్, మల్లేశం ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన అధికారికి పూల మొక్కలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో అటవీ విస్తీర్ణం పెంపునకు, పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందిస్తామని వారు పేర్కొన్నారు.

Similar News

News December 21, 2025

జాతీయ కరాటే పోటీల్లో వర్ధన్నపేట బాలుడికి స్వర్ణం

image

భోపాల్‌లో నిర్వహించిన 16వ నేషనల్ WFSKO ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్-2025లో వర్ధన్నపేట పట్టణానికి చెందిన ఎం.మహాజన్ ఉపేంద్ర బంగారు పతకం సాధించాడు. పుస్కోస్ పాఠశాలలో చదువుతున్న ఉపేంద్ర, 10 ఏళ్ల లోపు బాలుర విభాగంలో దేశవ్యాప్తంగా వచ్చిన వందలాది మంది క్రీడాకారులతో తలపడి అద్భుత నైపుణ్యంతో ఈ విజయాన్ని అందుకున్నాడు. జాతీయ స్థాయిలో స్వర్ణ పతకం సాధించిన ఉపేంద్రను పాఠశాల యాజమాన్యం అభినందించింది.

News December 21, 2025

జాతీయ లోక్ అదాలత్‌లో పరిష్కారమైన కేసుల వివరాలు

image

జాతీయలోక్ అదాలత్‌లో మొత్తం 7,233 కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ తెలిపారు.
✓ కొత్తగూడెం: సివిల్ 28, క్రిమినల్ 3561, సైబర్ క్రైమ్ 230, రోడ్డు ప్రమాదాలు 16 మొత్తం-3990
✓ ఇల్లందు: సివిల్ 10, క్రిమినల్ 493, బ్యాంకు 111, మొత్తం-614
✓ భద్రాచలం: క్రిమినల్ 1298, బ్యాంకు 102, మొత్తం-1400
✓ మణుగూరు: క్రిమినల్ 1178, పీఎల్సీ 51, మొత్తం-1229 కేసులు పరిష్కారమయ్యాయి.

News December 21, 2025

అమ్మవారిని దర్శించుకున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

image

కృష్ణా జిల్లా ఉయ్యూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. వెలగపూడి సచివాలయం సందర్శన అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆలయానికి చేరుకున్నారు. దేవస్థానంలో ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీనివాసరావు, పద్మావతి ఠాకూర్, ప్రత్యేక ఆహ్వానితుడు వెలగపూడి శంకరబాబు విద్యార్థులను స్వాగతించి దర్శనం, ప్రసాదం ఏర్పాటు చేశారు.