News October 9, 2025

సిద్దిపేట: అత్యాచారం కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష

image

అత్యాచారం, పెళ్లి చేసుకుంటానని ఓ ఉపాధ్యాయురాలిని మోసం చేసిన కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ.1.50 లక్షల జరిమానా విధిస్తూ సిద్దిపేట అడిషనల్ జడ్జి జయ ప్రసాద్ తీర్పు ఇచ్చారని సిద్దిపేట పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. బాధితురాలికి రూ.5 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారని కమిషనర్ తెలిపారు.

Similar News

News October 9, 2025

ఎన్నికల ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్ వెంకటేశ్ దోత్రే

image

ఆసిఫాబాద్‌ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఈ నెల 23, 27 తేదీల్లో జరుగుతాయని, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు అక్టోబర్ 31, నవంబర్ 4, 8వ తేదీల్లో మూడు విడతలుగా జరుగుతాయని పేర్కొన్నారు. జిల్లాలోని 335 గ్రామ పంచాయతీల్లో గల 2,874 వార్డులకు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

News October 9, 2025

జగన్ పర్యటన వేళ పోలీసుల సూచనలు

image

AP: మాజీ సీఎం జగన్ ‘చలో నర్సీపట్నం’ పర్యటన నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు సూచనలు చేశారు. నిర్వాహకులు కచ్చితంగా మార్గదర్శకాలు పాటించాలని స్పష్టం చేశారు. హైవేలు, కూడళ్లలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగేలా జన సమీకరణ చేయకూడదని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకైనా నిర్వాహకులే పూర్తి బాధ్యత వహించాలన్నారు. మెడికల్ కాలేజీ ప్రాంగణంలోనూ సామర్థ్యానికి మించి జనాలను సమీకరించకూడదని పేర్కొన్నారు.

News October 9, 2025

ఇకనైనా ANU ప్రతిష్ట మెరుగుపడుతుందా?

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తాత్కాలిక పరిపాలనకు తెరపడింది. గతంలో కంటే యూనివర్సిటీ NIRF ర్యాంకింగ్ 24 స్థానాలు తగ్గడంతోపాటు, విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై Way2Newsలో పలు కథనాలు ప్రరిచురించబడ్డాయ. ఈ పరిస్థితుల్లో నూతన వీసీ అకాడెమిక్ నాణ్యత, పేపర్ వాల్యుయేషన్, ఫలితాలలో పారదర్శకత, విద్యార్థుల సంక్షేమం పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తే విశ్వవిద్యాలయ ప్రతిష్టను పునరుద్ధరించేందుకు అవకాశముంది.