News September 8, 2025
సిద్దిపేట: అదను దాటవట్టే..యూరియా అందదాయే !

సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత అన్నదాతల్ని తీవ్రంగా వేధిస్తోంది. నెలరోజులుగా యూరియా కోసం రైతులు పడుతున్న తిప్పలు వర్ణనాతీతం. పంటలు ఎదిగే కీలక దశలో చల్లాల్సిన యూరియా దొరక్కపోవడంతో వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లుతుందని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 4.87 లక్షల ఎకరాలకు పైగా పంటలు సాగులోకి వచ్చాయి. 40 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరముండగా 28,882 మెట్రిక్ టన్నులే వచ్చింది.
Similar News
News September 9, 2025
జగన్‌ను జైల్లో పెడతారా? లోకేశ్ సమాధానమిదే!

AP: రాష్ట్రంలో ప్రతీకార రాజకీయాలకు చోటు లేదని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. ‘వైసీపీ హయాంలో చంద్రబాబును జైలులో పెట్టారు. ఇప్పుడు మీ ప్రభుత్వంలో జగన్‌ను జైలుకు పంపుతారా?’ అని ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ‘చేయాలనుకుంటే ఆ పని ఎప్పుడో చేసే వాళ్లం. కానీ మా దృష్టంతా రాష్ట్ర అభివృద్ధిపైనే ఉంది. నేనైనా ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే శిక్ష అనుభవించాల్సిందే’ అని పేర్కొన్నారు.
News September 9, 2025
నేడే ఉప రాష్ట్రపతి ఎన్నిక

ఉప రాష్ట్రపతి ఎన్నిక ఇవాళ జరగనుంది. ఓటింగ్ ఉ.10 గంటలకు ప్రారంభమై సా.5 గంటలకు ముగుస్తుంది. సా.6 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. NDA అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్, ప్రతిపక్ష కూటమి తరఫున జస్టిస్ సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు. లోక్‌సభ, రాజ్య సభ కలిపి మొత్తం 786 ఓట్లు ఉండగా, 394 ఓట్లు వచ్చిన వారు వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికవుతారు. NDA ఆ మార్క్ కంటే ఎక్కువ మంది సభ్యుల్ని (422) కలిగి ఉండటం గమనార్హం.
News September 9, 2025
సంగారెడ్డి: రాష్ట్రస్థాయి యోగా పోటీలో విద్యార్థులకు పతకాలు

నిర్మల్‌లో జరిగిన రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో జిల్లా విద్యార్థులకు పతకాలు వచ్చినట్లు జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ కుమార్ సోమవారం తెలిపారు. జూనియర్ విభాగంలో నిహారిక, నిఖితకు వెండి, సబ్ జూనియర్ విభాగంలో సంధ్య, పవిత్రకు రజతం, బాలుర విభాగంలో సంతోశ్, వసంతరావుకు వెండి పతకాలు వచ్చినట్లు చెప్పారు. షణ్ముక ప్రియాకు రాష్ట్ర స్థాయిలో నాలుగు, దివ్యశ్రీ ఐదవ స్థానం సాధించినట్లు తెలిపారు.