News April 13, 2025
సిద్దిపేట: అదుపుతప్పిన కారు.. బాలుడు మృతి

రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందిన ఘటన కుకునూరుపల్లి మండల పరిధి లకుడారం గ్రామ శివారులో జరిగింది. ఎస్ఐ శ్రీనివాస్ వివరాలు.. హైదరాబాద్‌కు చెందిన రాయవరం బాబి కుటుంబ సమేతంగా వేములవాడకు వెళ్లి తిరిగి వస్తుండగా లకుడారం శివారులో మల్లన్నవనం సమీపంలోని రాజీవ్ రహదారిపై కారు అదుపుతప్పి పల్టీలుకొట్టి బోర్లాపడింది. ఫలితంగా కార్తీక్(7) మరణించగా మిగతా నలుగురికి తీవ్ర గాయాలు అయినట్లు తెలిపారు.
Similar News
News April 14, 2025
పెద్దపల్లి: యువ వికాసం పథకానికి 34 వేల దరఖాస్తులు

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాసం పథకానికి పెద్దపల్లి జిల్లాలో 34 వేల దరఖాస్తులు వచ్చినట్లు సంబంధిత అధికారులు సోమవారం తెలిపారు. నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయంతో పాటు శిక్షణ కల్పించేందుకు రూపొందించిన ఈ పథకంపై యువతలో భారీ స్పందన కనిపిస్తోంది. ఇంకా దరఖాస్తు చేయని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
News April 14, 2025
అంబేడ్కర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి: ఆసిఫాబాద్ ఎస్పీ

అంబేడ్కర్‌ను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు అన్నారు. ఆసిఫాబాద్ పోలీస్ కార్యాలయంలో జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం కోసం, ప్రజలు హక్కుల కోసం అంబేడ్కర్ ఎంతో కృషి చేశారని కొనియాడారు.
News April 14, 2025
అంబేడ్కర్ ఆశయాలను కొనసాగించాలి: ఎర్రబెల్లి

దేవరుప్పుల మండల కేంద్రంలో నూతన అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ సోమవారం జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. డాక్టర్ అంబేడ్కర్ వల్లే భారత రాజ్యాంగం సాధ్యమైందన్నారు. వారి ఆశయాలను కొనసాగించేలా చూడాలన్నారు. కొందరు దేశ రాజకీయ నేతలు అంబేడ్కర్‌ను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలున్నారు.