News January 31, 2025
సిద్దిపేట: అధికారులకు సీపీ సన్మానం

మానభంగం, పోక్సో కేసులో నేరస్థుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష పడడంలో కీలకపాత్ర వహించిన అధికారులను పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ ఘనంగా సన్మానించి, అప్రిసియేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. మానభంగం, ఫోక్సో కేసులో నేరస్థుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా నేరస్థుడికి జైలు శిక్ష పడడానికి కీలకపాత్ర వహించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్, సీఐలు, సిబ్బందిని అభినందించారు.
Similar News
News July 6, 2025
వీరపనేనిగూడెంలో ప్రమాదం.. ఒకరి మృతి

గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో తెంపల్లికి చెందిన షేక్ యూసఫ్ బాషా (28) మృతి చెందాడు. తాపీ పని ముగించుకొని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా, ఇటుకబట్టీల వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. సమాచారం అందుకున్న ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
News July 6, 2025
బోరబండలో భార్యను హత్య చేసిన భర్త

HYD బోరబండ PS పరిధిలో భార్యను భర్త హత్య చేశాడు. స్థానికులు తెలిపిన వివరాలిలా.. సోనీ, నర్సింలు దంపతులు. మద్యానికి బానిసై నర్సింలు తాగివచ్చి తరుచూ చిత్రహింసలకు గురి చేసేవాడు. ఈ నేపథ్యంలో భార్య సోనీ పుట్టింటికి వెళ్లింది. తిరిగి వచ్చిన తర్వాత 3 రోజులుగా మళ్లీ చిత్రహింసలు పెడుతూ విచక్షణారహితంగా కొట్టడంతో సోనీ మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News July 6, 2025
IND Vs ENG: పొంచి ఉన్న వర్షం ముప్పు!

ENGతో రెండో టెస్టులో గెలుపు ముంగిట ఉన్న INDను వరుణుడు భయపెడుతున్నాడు. చివరిరోజు మ్యాచ్ జరిగే ఎడ్జ్‌బాస్టన్‌లో 60% వర్షం కురిసే ఛాన్స్ ఉందని ఆక్యూవెదర్ తెలిపింది. ముఖ్యంగా మార్నింగ్ సెషన్‌లో వాన పడొచ్చంది. ఇదే జరిగితే మ్యాచ్ డ్రా అయ్యే అవకాశం ఉంది. అయితే నిన్న గిల్ చాలా ఆలస్యంగా డిక్లేర్ ఇచ్చారని, ఇప్పుడు అదే కొంప ముంచొచ్చని క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. IND విజయానికి 7 వికెట్లు అవసరం.