News January 31, 2025

సిద్దిపేట: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య..!

image

అప్పుల బాధతో ఓ రైతు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలంలోని గొల్లపల్లి గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దొమ్మాట కిష్టయ్య(50) అనే రైతు ఏడాది క్రితం కుమార్తె వివాహాం కోసం రూ.15లక్షల అప్పు చేశాడు. తనకున్న ఎకరంన్నర భూమితో పాటు 7ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వరి, పత్తిని సాగు చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News July 4, 2025

కృష్ణ: గోల్డ్ మెడల్ సాధించిన ఎస్ఐ, కానిస్టేబుల్

image

కృష్ణ ఎస్ఐగా పనిచేస్తున్న ఎస్ఎం నవీద్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు. నాగర్ కర్నూల్ జిల్లాలో నిర్వహించిన జోగులాంబ జోన్-7 జోనల్ పోలీస్ డ్యూటీ మీట్ ముగింపు సమావేశంలో డీఐజీ ఎల్ఎస్ చౌహన్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్నారు. స్నైపర్ డాగ్స్ హ్యాండ్లర్ కానిస్టేబుల్ రవి ట్రాకింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ అందుకున్నారు. వీరిని ఎస్పీ యోగేశ్ గౌతమ్ అభినందించారు.

News July 4, 2025

KCR లేటెస్ట్ ఫొటోలు

image

TG: సాధారణ వైద్య పరీక్షల కోసం HYD యశోద ఆస్పత్రిలో చేరిన బీఆర్ఎస్ అధినేత KCRను పలువురు నేతలు పరామర్శించారు. <<16940361>>ఎలాంటి ఇబ్బంది లేకుండా<<>> కుర్చీలో కూర్చున్న మాజీ సీఎం.. కాసేపు నేతలతో మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు, రైతులకు యూరియా, ఎరువుల లభ్యత, వ్యవసాయం, సాగునీరు, ప్రజా సమస్యలపై వారితో చర్చించారు.

News July 4, 2025

ఇన్ని పథకాలు అమలు చేసిన ప్రభుత్వం మాదే: భట్టి

image

TG: రాజ్యాంగాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పోరాటం చేస్తోందని Dy.CM భట్టి విక్రమార్క అన్నారు. ‘రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. మార్చడానికి అది కేవలం ఒక పుస్తకం కాదు. రాజ్యాంగం లేకపోతే ఎవరికీ హక్కులు ఉండేవి కావు’ అని సామాజిక న్యాయ సమరభేరి సభలో వ్యాఖ్యానించారు. రాజ్యాంగ స్ఫూర్తితోనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, ఒక్క ఏడాదిలో ఇన్ని పథకాలు అమలు చేసిన ప్రభుత్వం తమదేనని పేర్కొన్నారు.