News February 1, 2025
సిద్దిపేట: అయ్యో పాపం.. కాలు తీసేశారు..!

సిద్దిపేట జిల్లా గోవర్ధనగిరిలో రెండురోజుల క్రితం <<15308889>>ఉపాధి హామీ<<>> కూలీలపై మట్టి పెళ్లలు పడిన ఘటనలో తీవ్ర గాయాల పాలయిన ఇంద్రాల స్వరూప కాలు నుజ్జు నుజ్జు కావడంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి డాక్టర్లు ఆమె కాలును తొలగించారు. ఈ సంఘటనలో తల్లి కూతుర్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. చికిత్స తీసుకొని ఇంటికి వస్తుందని అనుకున్న స్వరూప కాలు తీసేయడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
Similar News
News February 25, 2026
ఆనందంగా జీవించాలంటే ఇవి చాలు

జీవితంలో అశాంతికి కారణం పోలికే అంటున్నారు మానసిక నిపుణులు. ఇలా కాకుండా ఉండాలంటే మీకేం కావాలో ముందు తెలుసుకోవాలి. అసలైన సంపద ఆరోగ్యం, అవసరాలు తీర్చేంత బ్యాంక్ బ్యాలెన్స్, అర్థం చేసుకొనే భాగస్వామి, గాలి కబుర్లు, చెప్పుడు మాటలు చెప్పేవారిని దూరం పెట్టండి, రోజూ ఆత్మపరిశీలన చేసుకుంటే సరిపోతుంది. ప్రతికూల ఆలోచనలు చేయకండి. ఇతరులతో పోల్చుకోవడం మానేయండి.
News February 25, 2026
అనకాపల్లి: ఏపీ మోడల్ స్కూల్‌లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలో ఏపీ మోడల్ స్కూల్లో 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో అప్పారావు నాయుడు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.200, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.125 పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు. పూర్తి వివరాలకు సంబంధిత హెచ్ఎంలను సంప్రదించాలన్నారు.
News February 25, 2026
ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో జాతీయ సదస్సు

హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఈ నెల 25, 26న రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు సదస్సు డైరెక్టర్ డా.బి.ప్రసాద్ తెలిపారు. ప్రారంభ సభకు ముఖ్య అతిథిగా కేయూ వీసీ ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి హాజరు కానున్నారు. అలాగే కీలక ప్రసంగాన్ని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి చెందిన ఆనంద్ పవార్ ఇవ్వనున్నారు. సదస్సులో దేశ వ్యాప్తంగా అకడమిక్ నిపుణులు రానున్నారు.


