News January 31, 2025
సిద్దిపేట: అవార్డులు అందజేసిన సీపీ

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్కృష్ట, అతిఉత్కృష్ట సేవా పతకాలు పొందిన అధికారులను సిబ్బందిని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ అభినందించి, సేవా పథకాలు అందజేశారు. ఉత్కృష్ట సేవా పథక్ పొందిన వారిలో ఏఆర్ కానిస్టేబుళ్లు కే. శ్రీరామ్, కే.మల్లికార్జున్, మహిళా హోంగార్డు మమ్మద్ నసీమా, అతి ఉత్కృష్ట సేవా పథక్‌ను వెంకటరమణారెడ్డి, గోపాల్ రెడ్డి, ప్రభాకర్, నారాయణ, యాదయ్య, ప్రభు, జీవన్, అలెగ్జాండర్ పొందారు.
Similar News
News November 7, 2025
సిరిసిల్ల: సిద్ధమవుతున్న 64 లక్షల చీరలు

SHG సభ్యులకు పంచడానికి 64 లక్షల చీరలు సిద్ధమవుతున్నాయని సిరిసిల్ల ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరీమ అగ్రవాల్ తెలిపారు. సిరిసిల్లలో తయారవుతున్న ఇందిరా మహిళా శక్తి చీరలను 32 జిల్లా సమాఖ్యల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు శుక్రవారం పరిశీలించారు. ఇన్‌ఛార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరా మహిళాశక్తి కింద మహిళలకు చీరలు అందజేయడంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలోని వేలాదిమందికి ఉపాధి దొరుకుతుందని వెల్లడించారు.
News November 7, 2025
సిరిసిల్ల: ‘ఇందిరా మహిళా శక్తి చీరలు’ సిద్ధం: కలెక్టర్

రాష్ట్రంలోని అన్ని మహిళా సంఘాల సభ్యులకు పంపిణీ చేసేందుకు ‘ఇందిరా మహిళా శక్తి చీరలు’ (యూనిఫామ్స్) సిద్ధమవుతున్నాయని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేసే ఈ చీరల ఉత్పత్తి ప్రక్రియ, ఇతర అంశాలను నేరుగా తెలుసుకునేందుకు రాష్ట్రంలోని 32 జిల్లాల నుంచి జిల్లా సమాఖ్య అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు శుక్రవారం హాజరయ్యారు.
News November 7, 2025
SRSPకి తగ్గిన ఇన్‌ఫ్లో.. గేట్లు మూసివేత

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి వచ్చే వరద ప్రవాహం చాలావరకు తగ్గిపోయింది. ఈరోజు ఉదయం 9 గంటల సమయానికి ప్రాజెక్ట్ నీటిమట్టం 332.54 మీటర్లు, నిల్వ 80.5 టీఎంసీలుగా నమోదైంది. ఎగువ నుంచి 9,454 క్యూసెక్కుల నీరు వస్తుండగా, సరస్వతి కాల్వకు 650, ఎస్కేప్ కెనాల్ ద్వారా 8,000, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు విడుదల చేశారు. ఆవిరి రూపంలో 573 క్యూసెక్కులు నష్టపోతున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం గేట్లను మూసేశారు.


