News January 31, 2025
సిద్దిపేట: అవార్డులు అందజేసిన సీపీ

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్కృష్ట, అతిఉత్కృష్ట సేవా పతకాలు పొందిన అధికారులను సిబ్బందిని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ అభినందించి, సేవా పథకాలు అందజేశారు. ఉత్కృష్ట సేవా పథక్ పొందిన వారిలో ఏఆర్ కానిస్టేబుళ్లు కే. శ్రీరామ్, కే.మల్లికార్జున్, మహిళా హోంగార్డు మమ్మద్ నసీమా, అతి ఉత్కృష్ట సేవా పథక్‌ను వెంకటరమణారెడ్డి, గోపాల్ రెడ్డి, ప్రభాకర్, నారాయణ, యాదయ్య, ప్రభు, జీవన్, అలెగ్జాండర్ పొందారు.
Similar News
News February 26, 2026
కామారెడ్డి: ‘స్పందించకుంటే 195 వాహనాలకు వేలం’

కామారెడ్డి జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లలో స్వాధీనం చేసుకున్న 195 అబాండెడ్ వాహనాలను బహిరంగ వేలం వేయనున్నట్లు ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించారు. ఈ వాహనాలన్నీ ప్రస్తుతం జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్నాయని, యజమానులు తమ ధ్రువపత్రాలను సమర్పించి క్లెయిమ్ చేసుకోవాలని సూచించారు. 6 నెలల గడువులోగా తగిన ఆధారాలతో సంప్రదించని పక్షంలో, చట్టబద్ధంగా వేలం ద్వారా విక్రయిస్తామని స్పష్టం చేశారు.
News February 26, 2026
పార్వతీపురం: ‘బాల కార్మికులు పనికి కాదు.. బడికి వెళ్లాలి’

జిల్లాలోని బాల కార్మికులు పనికి కాదని.. బడికి వెళ్లాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పార్వతీపురం కలెక్టరేట్లో కార్మికుల నిర్మూలనపై సమావేశం నిర్వహించారు. జిల్లాలో బాల కార్మికుల నిర్ములన ఒక ఉద్యమంలా చేపట్టాలని బాల కార్మిక నిర్ములన శాఖ అధికారి ఎసిఎల్ సువర్ణను ఆదేశించారు. బాలల హక్కులను కాపాడటం ప్రతీ పౌరుడి బాధ్యత అని కలెక్టర్ పేర్కొన్నారు.
News February 26, 2026
పార్వతీపురం: డ్రగ్స్, గంజాయి వినియోగంపై ఉక్కుపాదం

జిల్లాలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగంపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి పోలీస్ శాఖను ఆదేశించారు. గురువారం పార్వతీపురం కలెక్టరేట్‌లో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. మాదక ద్రవ్యాల రవాణా నివారణకు పోలీసు, ఫారెస్ట్, ఎక్సైజ్ శాఖలతో జాయింట్ ఆపరేషన్ నిర్వహించాలని తెలిపారు. బస్సులు, రైల్వే స్టేషన్‌లలో డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేయాలని సూచించారు.


