News November 21, 2025

సిద్దిపేట: ఆపరేషన్ వద్దు సాధారణ కాన్పు ముద్దు: DMHO

image

సిజేరియన్ ఆపరేషన్ వద్దు.. సాధారణ కాన్పు ముద్దు అని DMHO డా.ధనరాజ్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట, హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని మీర్జాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బస్తీ దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో ప్రజలకు అందుతున్న ఆరోగ్య సేవలను అడిగి తెలుసుకున్నారు. రికార్థులను పరిశీలించారు. సీజనల్ వ్యాధుల పట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.

Similar News

News November 21, 2025

వనపర్తి: ‘ఉల్లంఘించిన రైస్ మిల్లులపై కేసులు’

image

వనపర్తి జిల్లాలో మొత్తం 173 రైస్ మిల్లులు ఉండగా ఈ ఏడాది 81 మిల్లులకు ధాన్యం కేటాయించేందుకు అనుమతులు ఇచ్చామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మిగిలిన మిల్లులు సకాలంలో ధాన్యం అప్పగించనందున ధాన్యం కేటాయించలేదని, 39 మిల్లులపై కేసులు సైతం నమోదు చేశామన్నారు. ధాన్యం కేటాయించాలంటే ముందుగా కనీసం 10% బ్యాంకు గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుందని.. ఇప్పటివరకు కేవలం 46 మిల్లులు మాత్రమే గ్యారంటీలు ఇచ్చినట్లు తెలిపారు.

News November 21, 2025

గులాం రసూల్ సేవలు మరువలేనివని: పల్లె శేఖర్ రెడ్డి

image

పేదల ఆశాజ్యోతి గులాం రసూల్ సేవలు మరువలేనివని సీపీఐ యాదాద్రి జిల్లా కార్యవర్గ సభ్యుడు పల్లె శేఖర్ రెడ్డి అన్నారు. రసూల్ 10వ వర్ధంతి సందర్భంగా చౌటుప్పల్ సీపీఐ కార్యాలయంలో నివాళులర్పించారు. రాచకొండ ఫైరింగ్ రేంజ్ వ్యతిరేక ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారని, గిరిజనులకు ఆదర్శంగా నిలిచారని చెప్పారు. జడ్పీటీసీ, MPTCగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన నాయకుడు అన్నారు.

News November 21, 2025

రాజమండ్రి: ఆర్టీసీకి రూ.32 లక్షల ఆదాయం

image

కార్తీక మాసం నేపథ్యంలో ఆర్టీసీకి కాసుల పంట పండింది. కార్తీకం వేళ జిల్లాలో ఉన్న డిపోల నుంచి 36 బస్సులు నడపడం ద్వారా రూ.32 లక్షల ఆదాయం వచ్చిందని డీపీటీవో మూర్తి శుక్రవారం తెలిపారు. శబరిమలకు 8 బస్సులు, పంచారామాలకు 13 బస్సులు, ఏకాదశి రుద్రులు, నవ నందులు, శివ కేశవ దర్శిని, కోనసీమ స్పెషల్‌గా 15 బస్సులు నడిపామన్నారు. అయ్యప్ప భక్తుల కోసం, అలాగే ధనుర్మాసంలో బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధంగా ఉందన్నారు.