News March 19, 2025
సిద్దిపేట: ఆర్థిక అక్షరాస్యత పురోభివృద్ధికి దోహదం: కలెక్టర్

ప్రతి వ్యక్తిలోని గుణాత్మకమైన ఆర్థిక అక్షరాస్యత స్థాయి వారి వ్యక్తిగత, కుటుంబాల అభివృద్ధికే కాకుండా, సమాజ ఆర్థికాభివృద్ధికి, దేశ సుస్థిరమైన పురోభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి అన్నారు. సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల కాన్ఫరెన్స్ హాల్‌లో కళాశాల వాణిజ్య శాస్త్ర విభాగాధిపతి డాక్టర్.గోపాల సుదర్శనం రచించిన “ఫైనాన్షియల్ లిటరసీ” పుస్తకావిష్కరణలో పాల్గొన్నారు.
Similar News
News January 10, 2026
ఫ్లెమింగో ఫెస్టివల్.. ఇరకం దీవిలో ఇదే స్పెషల్!

పులికాట్ సరస్సుకు మధ్యలో ఉండే ఇరకం దీవికి వెళ్లాలంటే 8 KM పడవ ప్రయాణం చేయాలి. అక్కడి ప్రయాణం ఓ మధురానుభూతిని మిగుల్చుతుంది. చల్లటి గాలులు తేలికపాటి అలల మధ్య సాగే పడవ ప్రయాణం.. గాలివాటున దూసుకెళ్లే తెరచాప పడవలు.. ఓవైపు ఎగురుతూ కనిపించే విదేశీ పక్షులు.. ఈ దృశ్యాలు ఎంతో ఆహ్లాదంగా అద్భుతంగా కనిపిస్తాయి. చుట్టూ ఉప్పునీరున్నా.. ఈ దీవిలో తాగేందుకు మంచినీరు పుష్కలంగా లభించడం ఇక్కడ ప్రత్యేకత.
News January 10, 2026
పసుపు ఉడకబెట్టే ప్రక్రియలో కీలక సూచనలు

పసుపు దుంపలను తవ్విన 2 నుంచి 3 రోజుల్లోపలే దుంపలను ఉడికించాలి. దీనివల్ల మంచి నాణ్యత ఉంటుంది. ఆలస్యమైతే నాణ్యత తగ్గుతుంది. పసుపు దుంపలు, కొమ్ములను వేరుగావేరుగా ఉడకబెట్టాలి. మరీ ఎక్కువ ఉడకబెడితే రంగు చెడిపోతుంది. తక్కువగా ఉడకబెడితే దుంపలు పెళుసుగా మారి మెరుగు పెట్టేటప్పుడు ముక్కలుగా విరిగిపోతాయి. స్టీమ్ బాయిలర్లలో తక్కువ సమయంలో ఎక్కువ పసుపును ఉడికించి, నాణ్యతతో కూడిన పసుపు పొందవచ్చు.
News January 10, 2026
వీసా ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులను పెంచిన US

వీసా ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజును పెంచుతున్నట్లు US ప్రకటించింది. పెంచిన ధరలు మార్చి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. H-1B, L-1, O-1, P-1, TN వంటి ఫామ్ I-129 వీసాలకు $2,805 (₹2.53L) నుంచి $2,965 (₹2.67L)కి పెంచింది. ఫామ్ I-140 ఇమ్మిగ్రంట్ పిటిషన్లకూ $2,965గా నిర్ణయించింది. ఫామ్ I-765, I-129 అప్లికేషన్స్‌కు $1,685 నుంచి $1,780కి పెంచింది. ఫామ్ I-539 అప్లికేషన్లకు $1,965 నుంచి $2,075గా నిర్ణయించింది.


