News October 15, 2025

సిద్దిపేట: ఆశావహుల్లో ఆందోళన..!

image

స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే ఇవ్వడంతో ఆశావహుల్లో ఆందోళన పెరిగింది. సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీగా గెలవాలని ఉత్సాహంగా ముందస్తు కార్యక్రమాలు చేపట్టిన వారికి నిరాశ ఎదురైంది. ఎన్నికలు వాయిదా పడడంతో, ఖర్చులు పెట్టి మళ్లీ పోటీ చేసినా తర్వాత ఎన్నికలు నిలిచిపోతే పరిస్థితి ఏంటంటూ కొందరు వెనుకంజ వేస్తున్నారు. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో ఒక్కసారిగా రాజకీయ వేడి తగ్గిపోయింది.

Similar News

News October 15, 2025

జూబ్లీహిల్స్: ఏకాదశి.. ద్వాదశి.. నామినేషన్ వేయ్ మామా

image

వచ్చేనెల 11న జరిగే జూబ్లిహిల్స్ ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని అభ్యర్థులు భావిస్తున్నారు. ప్రధాన పార్టీ క్యాండిడేట్స్‌తోపాటు స్వతంత్ర అభ్యర్థులు విజయం కోసం తపిస్తున్నారు. ముఖ్యంగా ఏ రోజు నామినేషన్ వేస్తే కలిసొస్తుందనే విషయంపై తర్జనభర్జన పడుతున్నారు. రేపటి నుంచి 3 రోజుల పాటు మంచిరోజులు (దశమి.. ఏకాదశి.. ద్వాదశి) ఉండటంతో తమకు అనుకూలమైన రోజు చూసుకొని నామినేషన్ వేయనున్నారు.

News October 15, 2025

జూబ్లీహిల్స్‌: సాదాసీదాగా సునీత నామినేషన్

image

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో BRS అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్‌ నామినేషన్‌ వేశారు. షేక్‌పేటలోని తహశీల్దార్‌ కార్యాలయంలో KTRతో కలిసి ఎలాంటి హడావుడి లేకుండా నామినేషన్‌ పత్రాలు అందజేశారు. ఆమె వెంట మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, ప‌ద్మారావుగౌడ్, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.

News October 15, 2025

ఎన్నికల చిత్రం: అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు

image

ఎన్నికల వేళ పార్టీలు మారడం సహజమే. అలాగే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా నాయకులు కండువాలు మార్చేస్తున్నారు. మస్కటి డైరీ డైరెక్టర్ అలీ మస్కటి గత అసెంబ్లీ ఎన్నికల ముందు TDP నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఈ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి BRSలో చేరారు. అలాగే తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నేత నాని ఆ పార్టీని వదిలి నుంచి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు.