News August 19, 2025

సిద్దిపేట: ఇంటిని జాకిలతో పైకి ఎత్తేశారు !

image

టెక్నాలజీ ఉపయోగించుకుంటే అన్ని సాధ్యమే అన్నట్టుంది. సిద్దిపేటలో టైర్లు మార్చుకునేందుకు ఉపయోగించే జాకీలతో ఇంటిని పైకెత్తారు. వివరాల్లోకి వెళితే సిద్దిపేటకు చెందిన ఆరుట్ల యాదవరెడ్డి 15ఏళ్ల క్రితం ఇల్లు నిర్మించగా ఇప్పుడు అది రోడ్డుకు సమాంతరంగా ఉంది. దీంతో ఇంటిని 3 నుంచి 5 ఫీట్లు ఎత్తు పెంచేందుకు ఓ కన్సెక్షన్‌ను సంప్రదించగా 15 మంది కూలీల సాయంతో 100 జాకీలతో పని మొదలు పెట్టి ఇంటిని పైకి లేపారు.

Similar News

News August 19, 2025

రాజమండ్రి: నకిలీ దస్తావేజులు సృష్టించే ముఠా అరెస్ట్

image

నకిలీ దస్తావేజులు సృష్టించి ఆస్తులు విక్రయిస్తున్న ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు ఈస్ట్ జోన్ డీఎస్పీ విద్య తెలిపారు. రాజమండ్రికి చెందిన గొల్లపల్లి కాశీ విశాలాక్షి ఫిర్యాదు మేరకు బొమ్మూరు పోలీసులు చేపట్టిన విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కవలగొయ్యిలోని విశాలాక్షి ఆస్తులకు నకిలీ పత్రాలు సృష్టించి అమ్మివేసిన ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు.

News August 19, 2025

ఏలూరు: రైలు ఢీకొని మహిళ మృతి

image

పొట్టిపాడు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని ఓ మహిళ మృతిచెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మంగళవారం ఏలూరు రైల్వే స్టేషన్ పరిధి పొట్టిపాడులో రైల్వే ట్రాక్ దాటుతున్న చిక్కవరపు లక్ష్మి (30)ని రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామన్నారు.

News August 19, 2025

ధవళేశ్వరంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను పరిశీలించిన కలెక్టర్

image

రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరంలో ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి మంగళవారం పరిశీలించారు. ఈ కేంద్రాన్ని ఆగస్టు 20న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా ప్రారంభిస్తారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేశ్ ప్రత్యక్షంగా పాల్గొని శిలాఫలకం ఆవిష్కరించి కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.