News April 2, 2025
సిద్దిపేట: ఇందిరమ్మ ఇళ్లపై స్పెషల్ సెక్రటరీ కాన్ఫరెన్స్

ఇళ్లు లేని పేదల సొంతింటి కలను సాకారం చేసేలా, రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రవేశపెట్టిందని రాష్ట్ర హౌజింగ్ స్పెషల్ సెక్రటరీ వి.పి. గౌతమ్ అన్నారు. బుధవారం ఇందిరమ్మ ఇండ్ల పథకం గురించి జిల్లా అధికారులతో స్పెషల్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశా నిర్దేశనం చేశారు. జిల్లా నుంచి అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Similar News
News April 3, 2025
నెల్లూరు జిల్లాలో విషాదం

బడికి వెళ్లి చదువుకోవాల్సిన ఆ చిన్నారికి ఏ కష్టం వచ్చిందో ఏమో. 6వ తరగతికే ఈ జీవితం చాలు అనుకుంది. 11 ఏళ్ల ప్రాయంలోనే బలవనర్మణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన నెల్లూరు జిల్లాలో వెలుగు చూసింది. ఆత్మకూరు పట్టణంలోని వందూరుగుంటకు చెందిన బాలిక(11) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది. ఈక్రమంలో ఇవాళ ఇంట్లోని బాత్ రూములో ఉరేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
News April 3, 2025
కర్నూలు: పిడుగు పాటుతో బాలుడి మృతి

కర్నూలు జిల్లాలో గురువారం విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎమ్మిగనూరు మండలం కందనాతిలో రవి(15) పొలం పనులు చేస్తున్నాడు. మెరుపులతో బాలుడి సమీపంలో పిడుగు పడింది. దీంతో రవి అక్కడికక్కడే మృతి చెందాడు. అతనితోపాటు పొలంలో పనిచేస్తున్న పలువురికి గాయాలు కాగా వారిని వెంటనే ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రవి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
News April 3, 2025
త్వరలో ‘బుడమేరు’ మరమ్మతులకు టెండర్లు: నిమ్మల

AP: గతేడాది విజయవాడను ముంచెత్తిన ‘బుడమేరు’ మరమ్మతులకు త్వరలో టెండర్లు పిలవాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. బుడమేరు డైవర్షన్ కెనాల్ పెండింగ్ పనుల పూర్తికి ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. వెలగలేరు రెగ్యులేటర్ నుంచి కొల్లేరు వరకు ఓల్డ్ ఛానెల్ సామర్థ్యం పెంపు, దానికి సమాంతరంగా కొత్త ఛానెల్ అభివృద్ధిపై ఫోకస్ చేయాలన్నారు. వరదల నియంత్రణకు కేంద్ర సాయంతో ముందుకెళ్లాలని పేర్కొన్నారు.