News April 15, 2025
సిద్దిపేట: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు చెక్కు అందజేత

హైదరాబాద్ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులతో కలిసి వివిధ జిల్లాల్లో ఎంపిక చేసిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో బేస్ మెంట్ లెవెల్ పూర్తి చేసిన లబ్ధిదారులకు వారి చేతుల మీదుగా లక్ష రూపాయల చెక్కును అందజేశారు. సిద్దిపేట జిల్లా నుంచి బేస్మెంట్ లెవెల్ పూర్తిచేసిన లబ్ధిదారుల్లో ఎంపికైన కోహెడ మండలం పోరెడ్డిపల్లి దబ్బెట రాజవ్వకు అందజేశారు.
Similar News
News November 12, 2025
కేయూలో భవనం కోసం భారీ వృక్షాలు కట్!

కాకతీయ యూనివర్సిటీలో భారీ వృక్షాలను నేలమట్టం చేశారు. కొత్త విద్యుత్ లైను పేరుతో ఏళ్ల నాటి చెట్లను నరికివేయడంపై అసహనం వ్యక్తమవుతోంది. ఓ భవన నిర్మాణం కోసమని ఇప్పటికే భారీ వృక్షాలను నరికివేసిన అధికారులు.. ఇప్పుడు అదే భవనం కోసం పాత విద్యుత్ లైనునే మార్చివేసి కొత్తది వేశారు. ఇందుకోసం వర్సీటీలో భారీ వృక్షాలను నేలమట్టం చేయడంపై ప్రకృతి ప్రేమికులు భగ్గుమంటున్నారు.
News November 12, 2025
భారీ ‘ఉగ్ర కుట్ర’.. సంచలన విషయాలు

ఢిల్లీలోని ఎర్రకోట మెట్రోస్టేషన్ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడి ఘటనపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జనవరి 26 గణతంత్ర దినోత్సవం, దీపావళి రోజున భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర చేసినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఇందుకోసం ఉమర్ నబీ, ఉమర్ మహ్మద్ పలుమార్లు ఎర్రకోట వద్ద రెక్కీ చేసినట్లు సమాచారం. కాగా ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటివరకు 9 మందిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది.
News November 12, 2025
రాష్ట్రంలో 78శాతం కరెంటు పరిగి నుంచే!

పరిగి పక్కన ఉన్న నాజీరాబాద్ విండ్ ఫామ్ రాష్ట్రంలోనే అతిపెద్ద గాలి కరెంటు ప్రాజెక్టు ఇది. రూ.600 కోట్లతో మైత్రా ఎనర్జీ సంస్థ దీన్ని కట్టింది. 48 మరలతో 100.8MW కరెంటు ఉత్పత్తి అవుతోంది. రాష్ట్రంలో గాలితో వచ్చే కరెంటులో 78% ఇక్కడి నుంచే వస్తుంది. 125 మీటర్ల ఎత్తులోని ఈ టవర్లు గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలకు కీలకంగా మారాయి. ప్రభుత్వం పెట్టుకున్న 4,500 మోగా వాట్ల లక్ష్యానికి ఇదే ఆధారం.


